వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత ఫిర్యాదు: నా పని కాదన్న సుష్మా స్వరాజ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు తన రిఫ్రిజిరేటర్ సమస్యను చెప్పాడు. దానికి ఆమె తనదైన శైలిలో స్పందించారు. తనకు చాలా పనులు ఉన్నాయని, రిఫ్రిజిరేటర్ విషయంలో తాను ఎలాంటి సహాయం చేయలేనని చురక అంటించారు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా కేంద్రమంత్రులకు బాధితులు తమ సమస్యలను చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, సుష్మా స్వరాజ్ తదితరులు సమస్యల పైన వెంటనే స్పందిస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం.

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించగలుగుతున్నాయి. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ నేతృత్వంలోని విదేశాంగ శాఖ.. ట్విట్టర్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. తాము ఆపదలో ఉన్నామంటూ చిన్న ట్వీట్‌ వస్తే.. సుష్మాస్వరాజ్‌ స్పందిస్తుంటారు.

Sushma Swaraj trolls guy asking for help with refrigerator problems

అందుకు తగిన చర్యలు చేపడతారు. అయితే, రిఫ్రిజిరేటర్ పైన వచ్చిన ట్వీట్ మాత్రం అందరినీ ముక్కున వేలు వేసుకునేలా చేసింది. సుష్మాస్వరాజ్‌‌తో పాటు మరో కేంద్రమంత్రి రామ్ విలాస్‌ పాశ్వాన్‌ను ట్యాగ్‌ చేస్తూ.. వెంకట్‌ అనే పేరుతో ఉన్న ట్విట్టర్‌ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది.

అందులో... 'డియర్‌ మినిస్టర్స్‌.. ఓ కంపెనీ నాకు చెడిపోయిన రిఫ్రిజిరేటర్‌ అమ్మింది. అడిగితే, వారు ఫ్రిజ్‌ వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా లేరు సరి కదా.. బాగు చేయించుకోమని సలహా ఇచ్చారు' అని ట్వీట్‌ చేశారు.

దానికి సుష్మా సున్నితంగా సమాదానం ఇచ్చారు. బ్రదర్ అని సంబోధిస్తూ... రిఫ్రిజిరేటర్‌ విషయంలో తాను సాయం చేయలేనని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తాను బిజీగా ఉన్నానని ప్రతి ట్వీట్ చేశారు. ఇది చూసి నెటిజన్లు సుష్మా పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

English summary
Sushma Swaraj's hilariously honest response on Twitter to a man who wanted his refrigerator fixed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X