ఎటిఎం దాడి: పోలీసుల అదుపులో అనుమానితుడు?

బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో జరిగిన ఎటిఎం దాడి కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని తుమ్కూరులో ఒక వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వేణుగోపాల్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ నిందితుడు అతనేనా కాదా అనే విషయాన్ని మాత్రం ధ్రువీకరించడం లేదు.

ఎటిఎం దాడి కేసులో నిందితుడిని పట్టుకోవడానికి దాదాపు 400 మంది పోలీసులు రంగంలోకి దిగారు. అయినా ఫలితం దక్కడం లేదు. కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అతని కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అనంతపురం జిల్లాలో కూడా పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో ఇద్దరు మహిళలను హత్య చేసిన వ్యక్తి అతనేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ, ఎటిఎం దాడి కేసు నిందితుడు మాత్రం పోలీసుల చేతికి చిక్కడం లేదు.

Suspect in ATM attack case nabbed

పగటిపూట బెంగళూర్‌లోని ఓ ఎటిఎం కేంద్రంలో ఓ మహిళపై నవంబర్ 19వ తేదీన దారుణంగా దాడి జరిగిన విషయం తెలిసిందే. గార్డు లేని రద్దీగా ఉండే జెసి రోడ్డులోని ఎటిఎం కేంద్రంలో ఓ దుండగుడు మహిళా బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేశాడు. ఈ దృశ్యాలు సిసిటివీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఎల్ఐసీ భవనంలో కల కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలో నగదు తీసుకోవడానికి కార్పొరేషన్ బ్యాంకుమేనేజర్ జ్యోతి ఉదయ్ (44)మంగళవారం ఉదయం ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు.

జ్యోతి లోపలికి ప్రవేశించిన కొద్ది క్షణాల్లోనే ఓ దుండగుడు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి షట్టర్ మూసేశాడు. అరిస్తే చంపేస్తానంటూ వెంట బ్యాగులో తెచ్చుకున్న కత్తి, రివాల్వర్‌తో ఆమెను బెదిరించాడు. మారణాయుధాలు చూసినా బెదరని జ్యోతి ఆగంతకుడిపై తిరగబడింది. తనపై తిరగబడ్డ జ్యోతిపై ఆగంతకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో జ్యోతి స్పృహకోల్పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+