ముంబైలో ఎబోలా కలకలం, భయం లేదని డాక్టర్స్ వెల్లడి

అంతేకాక అతడి నుంచి సేకరించిన నమూనాలను పూణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్ శెట్టి తెలిపారు. లలిత్ కుమార్‌కు ఎబోలా సోకిందని నిర్ధారణ కాలేదని వైద్యులు చెప్పారు. భారత్‌లో, ముంబైలో ఎలాంటి ఎబోలా కేసు లేదని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు, ఇదిలా ఉంటే, ఆఫ్రికా నుంచి చెన్నై వచ్చిన వ్యక్తికి ఎబోలా సోకలేదని నిర్ధారణ కావడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. అతడి నమూనాలను పరిశీలించిన పూణె వైరాలజి ప్రయోగశాల, నమూనాల్లో ఎబోలా వ్యాధి లక్షణాలు లేవని తేల్చేసింది.
దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ సోమవారం బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు అమలులో ఉండే ఈ ఎమర్జెన్సీ నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల వద్ద వైద్య బృందాలను నియమిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఎబోలా వ్యాపిస్తున్న నైజీరియాలో రోగుల సంఖ్య పదికి పెరిగింది. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం అత్యవసరస్థితిని ప్రకటించింది. మూడు నెలల పాటు ఇది అమలులో ఉంటుంది.












Click it and Unblock the Notifications