రెండు దేశాల ఉగ్రవాదులతో లింక్, వీడు మణిపూర్ లో ఏం చేశాడంటే ? !
మణిపూర్: రెండు దేశాల ఉగ్రవాదులతో (terrorist) లింక్ పెట్టుకుని ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న మణిపూర్‌కు చెందిన నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన ఉగ్రవాదులతో అంతర్జాతీయ కుట్రకు సంబంధించి దేశంలోని అగ్రశ్రేణి ఉగ్రవాద నిరోధక సంస్థ మణిపూర్‌లోని (manipur) కొండ జిల్లా అయిన చురాచంద్‌పూర్‌లో అనుమానిత ఉగ్రవాదిని (terrorist) అరెస్టు చేశారు. నిందితుడిని విచారించి తదుపరి విచారణ నిమిత్తం ఢిల్లీకి తరలించారు.
మయన్మార్, బంగ్లాదేశ్‌లోని అతని నెట్‌వర్క్ మణిపూర్ (manipur) సంక్షోభాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందని ఉగ్రవాద నిరోధక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ట్విట్టర్ లో (X) పోస్ట్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదిని సెమిన్‌లున్ గాంగ్టేగా గుర్తించామని అధికారులు అంటున్నారు.

అతను భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మయన్మార్, బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాద (terrorist) సంస్థల నాయకత్వంల కుట్రలో కీలక పాత్ర పోషించాడన అధికారులు అంటున్నారు. మణిపూర్‌లో (manipur) అశాంతి మరియు జాత్యహంకారాన్ని నిందితుడు ఉపయోగించుకుంటున్నాడని ఎన్ఐఏ( NIA) పేర్కొంది. జూన్ 22న మణిపూర్‌లోని క్వాక్తాలో ఒక వ్యక్తిని చంపిన కారు బాంబు పేలుడులో సెమిన్‌లున్ గాంగ్టే ప్రధాన నిందితుడని పోలీసు వర్గాలు ఎన్‌డీ టీవీకి తెలిపాయి.
జూన్ 22వ తేదీన ఒక చిన్న వంతెన సమీపంలో ఆపి ఉంచిన స్కార్పియో (SUV) పేలింది, దీంతో హింస తీవ్ర మలుపుకు దారితీసింది. శిక్షణ పొందిన ఉగ్రవాదులు (terrorist) ఈ దాడికి పాల్పడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే గాంగ్టే ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు అనే విషయం మాత్రం ఎన్‌ఐఏ వెల్లడించలేదు. దాదాపు 25 కుకీల తిరుగుబాటు గ్రూపులు ఎక్కువగా చురచంద్‌పూర్‌లో ఉన్నాయి.

మయన్మార్, బంగ్లాదేశ్‌లోని మిలిటెంట్ (terrorist) గ్రూపులు వివిధ జాతుల మధ్య చీలికలు సృష్టించే ఉద్దేశ్యంతో హింసాత్మక సంఘటనలకు పాల్పడేందుకు భారతదేశంలోని ఒక వర్గం తీవ్రవాద (manipur) నాయకులతో కలిసి కుట్ర పన్నినట్లు భారత ప్రభుత్వ దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ ( NIA) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications