కోల్‌కతా వద్దు.. మరో హైకోర్టుకు ఓకే.. సుప్రీంకోర్టును కోరిన సువేంద్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ చతికిలబడ్డ సంగతి తెలిసిందే. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయ్యారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలుపొందారు. సువేందు అధికారి గెలుపుపై మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను కోల్ కతా హైకోర్టులో విచారించొద్దు అని కోరారు.
మమత పిటిషన్ ను మరో హైకోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్ మినహా మరెక్కడ విచారణ జరిపినా ఫరావలేదని పేర్కొన్నారు. బెంగాల్‌లో అయితే మమతా బెనర్జీ ప్రభావితం చేస్తారని ఆయన వెర్షన్.. అందుకే మరో హై కోర్టుకు బదిలీ చేయాలని కోరారు.

గత నెల వచ్చిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీదీ మాత్రం నందిగ్రామ్‌లో ఓడిపోయారు. అయినా ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆరు నెలల్లోగా ఆమె మరో స్థానం నుంచి గెలుపొందాల్సిన అనివార్యత ఏర్పడింది. అందుకోసమే ఆమె బై పోల్ త్వరగా నిర్వహించాలని కోరుతున్నారు.
వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభ చూపలేదు. లోక్ సభ ఎన్నికల్లో సీట్లు సాధించగా.. అసెంబ్లీ వరకు వచ్చేసరికి చతికిలబడింది. దీనికి ప్రాంతీయ తత్వం.. అమిత్ షా, జేపీ నడ్డా చేసిన ర్యాలీలు ఉద్రిక్తత తదితర అంశాలు ప్రభావం చూపాయి. బెంగాలీలు చివరికీ దీదీకే పట్టం కట్టారు.












Click it and Unblock the Notifications