సంతానం కోసం వెళ్తే!: స్వామిజీ చేసిన పనికి ఆ భర్తకు మైండ్ బ్లాంక్..

అలా ఏకంగా పునీతను తీసుకుని చెప్పా పెట్టకుండా ఎక్కడికో పారిపోయాడు.

చెన్నై: మనదేశంలో సైంటిస్టుల కన్నా స్వామిజీలకే క్రేజ్ ఎక్కువ అన్న ప్రచారం ఉంది. దాన్ని నిజం చేసేలా తరుచూ ఏదో ఘటన తెరపైకి వస్తూనే ఉంది. రోగమొచ్చినా.. నొప్పి వచ్చినా.. డాక్టర్ వద్దకు వెళ్లేవాళ్ల కన్నా.. బాబాల వద్దకే పరిగెత్తేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. బాగా చదువుకున్నవాళ్లలోను ఇదే జాఢ్యం కనిపిస్తుండటం కలవరపరిచే అంశం.

ఇదంతా పక్కనపెడితే.. తాజాగా మరో దొంగస్వామి లీలలు బయటపడ్డాయి. సంతానం కోసం స్వామీజీ దగ్గరకు వెళ్తే.. ఏకంగా ఆమెతోనే జంప్ అయ్యాడాయన. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా ఆరూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాలను పరిశీలిస్తే.. పళ్లియాకారై ప్రాంతానికి చెందిన విజయకుమార్‌, పునీత దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. అయితే వీరికి సంతానం కలగలేదు. దీంతో స్వామిజీని ఆశ్రయించి తమకు పిల్లలు పుట్టేలా చేయాలని వేడుకున్నారు. ప్రత్యేక పూజలతో సంతానభాగ్యం కలిగిస్తానని బాలమురుగన్ నమ్మబలికాడు.

swamiji balamurugan escaped with married woman

ఆ వంకతో తరుచూ విజయకుమార్ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో ఈనెల 21న స్వామిజీ దర్శనం కోసం మఠానికి వెళ్లిన పునీత తిరిగిరాలేదు. ఆరా తీస్తే.. స్వామిజీ ఆమెను ఎక్కడికో తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో మోసపోయానని గ్రహించిన విజయకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, గపట్టినం ప్రాంతానికి చెందిన బాలమురుగన్‌ ఓ నకిలీ బాబా అని తేలింది. కొన్నాళ్లు బెంగళూరు ఐటీ సంస్థలో పనిచేసిన ఆయన.. పెళ్లి కూడా చేసుకున్నారని చెబుతున్నారు. ఇంటి నుంచి పారిపోయి బాబా అవతారమెత్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం స్వామిజీ కోసం వేట కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+