Swamiji: ఫేమస్ మఠంలో కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్వామీజీ, ఏం జరిగింది ? !
బెంగళూరు/రామనగర: అక్షరభ్యాసం, అన్నదానం చెయ్యడంతో ఆ మఠానికి చాలా పేరుప్రతిష్టలు ఉన్నాయి. ప్రముఖ మఠానికి మంచి పేరు ఉంది. ఇటీవల మఠం 25 సంవత్సరాల వార్షికోత్సవం ఘనం నిర్వహించారు. ఆ మఠాధిపతి అందరి దగ్గర మంచి పేరు సంపాధించుకున్నారు. మఠాధిపతి నిత్యం సమాజసేవ చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన స్వామీజీ ఉదయం అదే గదిలో శవమై కనిపించారు. గదిలోని కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మఠానికి చెందిన భక్తులు హడలిపోయారు. స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు మూడు పేజీల డెత్ నోట్ రాశారని పోలీసులు అంటున్నారు. అయితే స్వామీజీ డెత్ నోట్ లోని వివరాలను పోలీసులు బయటకు చెప్పకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఫేమస్ మఠం
బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని మాగడి తాలుకాలో కంచుగల్ బండే మఠం ఉంది. కుంచుగల్ బండే మఠం మఠాధిపతిగా బసవలింగ స్వామీజీ (45) పని చేస్తున్నారు. అక్షరభ్యాసం, అన్నదానం చెయ్యడంతో కుంచుగల్ బండే మఠానికి రామనగర జిల్లాతో పాటు కర్ణాటకలో చాలా పేరుప్రతిష్టలు ఉన్నాయి.

25 సంవత్సరాల వార్షికోత్సవం
కంచుగల్ బండే మఠానికి రామనగర జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో మంచి పేరు ఉంది. ఇటీవల కంచుగల్ బండే మఠం 25 సంవత్సరాల వార్షికోత్సవాలు మఠాధిపతి బసవలింగ స్వామీజీ ఆధ్వర్యంలో చాలా ఘనం నిర్వహించారు. ఈ వార్షికోత్సవాలకు కంచుగల్ బండే మఠానికి చెందిన భక్తులతో పాటు ఇతర జిల్లాల భక్తులు హాజరైనారు.

మఠంలో ఆత్మహత్య చేసుకున్న స్వామీజీ
కంచుగల్ బండే మఠాధిపతి బసవలింగ స్వామీజీ భక్తుల దగ్గర మంచి పేరు సంపాధించుకున్నారు. మఠాధిపతి బసవలింగ స్వామీజీ నిత్యం సమాజసేవ చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన బసవలింగ స్వామీజీ ఉదయం అదే గదిలో శవమై కనిపించడంతో కంచుగల్ బండే మఠంలోని భక్తులు, సిబ్బంది హడలిపోయారు.

డెత్ నోట్ లో ఏముంది ?
కంచుగల్ బండే మఠంలో మఠాధిపతి బసవలింగ స్వామీజీ బసచేసే గదిలోని కిటికీకి ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మఠానికి చెందిన భక్తులు హడలిపోయారు. బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు మూడు పేజీల డెత్ నోట్ రాశారని పోలీసులు అంటున్నారు. బసవలింగ స్వామీజీ డెత్ నోట్ లోని వివరాలను పోలీసులు బయటకు చెప్పకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇటీవల కాలంలో కర్ణాటకలో కొంత మంది మఠాధిపతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications