ఒకరిద్దరు ప్రధాన మంత్రులు చనిపోతారు, యుద్దాలు, రోగాలు, స్వామీజీ సంచలనం, గతంలో జరిగింది !
2023లో భయంకరమైన కరువు, వరదలు రెండింటినీ చవిచూసిన భారతదేశానికి 2024లో ప్రకృతి వైపరీత్యాలు తప్పవని కర్ణాటకకు చెందిన ప్రముఖ స్వామిజీ, కోడిమఠానికి చెందిన డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ జోస్యం చెప్పారు. 2024లో రోజులు బాగుండవని స్వామీజీ అన్నారు. డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ మీడియాతో 2024లో అకాల వర్షాలు, బాంబు పేలుళ్లు, యుద్ధం జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజం కావడంతో ఆయన జోస్యం మీద ప్రజలకు నమ్మకం ఉంది. ప్రజలు భయాందోళనకు గురవుతారని, భూకంపాలు, వరదలు కూడా వస్తాయని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ అంచనా వేస్తున్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఒకరిద్దరు ప్రధానులు చనిపోతారని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది పెద్ద ప్రమాదాలు జరుగుతాయని, అకాల వర్షాలు కురవడం వల్ల పెద్దఎత్తున సమస్యలు వచ్చి లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, బాంబు పేలుళ్లలో వందలాది మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉందని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ చెబుతున్నారు. మతపరమైన సమస్యల కారణంగా ప్రజలు మరింత నష్టపోతారని, ప్రపంచంలోని ప్రభావవంతమైన వ్యక్తులు చనిపోతారని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ జోస్యం చెప్పారు.
మళ్లీ కొన్ని వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, పెను సునామీ వచ్చే అవకాశం ఉందని, వీటన్నింటి నుంచి ప్రజలను కాపాడే శక్తి భగవంతుడికి ఉందని, మనం దేవుడిని ప్రార్థించుకోవాలని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ అన్నారు. అయోధ్య రామమందిరం గురించి కూడా డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ మాట్లాడారు. అయోధ్యలో ఇటీవల ప్రారంభమైన రామాలయం గురించి కోడిమఠం డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ మాట్లాడుతూ భారతీయుల్లో ఆధ్యాత్మిక చింతన రోజురోజుకు పెరగడం శుభపరిణామం అన్నారు.
రామజన్మభూమిలో దేవాలయం నిర్మించడం శుభపరిణామమని, రాజకీయాలకు మతం అట్టగట్టడం అంత మంచిది కాదని అన్నారు. ఉగాది తర్వాత దేశ, కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై అంచనాలు చెబుతానని, ఉగాదికి ముందు అంచనాలు వేయడం సరికాదని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ మీడియాకు చెప్పారు. గతంలో కూడా దేశ రాజకీయాలు, కర్ణాటక రాజకీయాలు, దేశంలో జరగబోయే పరిస్థితుల గురించి డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ చెప్పిన జోస్యం ఎక్కువ శాతం నిజం కావడంతో ఆయన జోస్యం మీద కర్ణాటక ప్రజలకు, దేశంలోని కొందరికి ఎక్కువ నమ్మకం ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications