Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Swapna: నన్ను టార్చర్ పెట్టారు, సీఎంను ఇరికించాలని స్కెచ్, ఈడీ అధికారులపై రివర్స్ కేసు !

కొచ్చి/ తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైలుపాలైన స్వప్న సురేష్ అలియాస్ స్వప్న మేడమ్ కేసు రసవత్తరంగా మారింది. తాను కేరళ సీఎం పినరయి విజయన్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇస్తే తనను శిక్ష నుంచి తప్పిస్తామని, నువ్వు అలా చెయ్యాలని, లేదంటే జైల్లోనే ఉంటావని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED)అధికారులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని స్వప్న ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో రికార్డు కావడం, ఆ ఆడియో, వీడియో లీక్ కావడం కలకలం రేపింది. ఆ మొబైల్ రికార్డింగ్ టేపులు బయటకు రావడంతో కేరళ ప్రభుత్వం ఉలిక్కిపడింది. స్వప్న సురేష్ జైల్లో మొబైల్ ఫోన్ లో ఎలా మాట్లాడింది ?, ఆ ఆడియో టేపులు ఎలా బయటకు వచ్చాయి ?, ఆమెకు ఎవరు సహాయం చేశారు ? అంటూ దర్యాప్తు మొదలైయ్యింది. దర్యాప్తు దెబ్బతో స్వప్న సురేష్ మీద ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ఈడీ అధికారుల మీద కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చెయ్యడం కలకలం రేపింది.

 దెబ్బకు అందర్

దెబ్బకు అందర్

అక్రమ బంగారు రవాణా కేసులో అరెస్టు అయిన స్వప్న సురేష్ అలియాస్ స్వప్నను కేరళలోని తిరువనంతపురంలోని అత్తక్కులంగర మహిళా సెంట్రల్ జైలులో పెట్టారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన కేసులో ఈడీ అధికారులు, కస్టమ్స్ అధికారులు స్వప్న సురేష్ ను అనేకసార్లు విచారణ చేసి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నారు.

 సీఎంను ఇరికించాలని స్కెచ్ ?

సీఎంను ఇరికించాలని స్కెచ్ ?

తిరువనంతపురం మహిళా సెంట్రల్ జైల్లో స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో టేపులు. ఓ వీడియో లీక్ కావడంతో వాటిని ఆన్ లైన్ మీడియా సంస్థ దిక్యూ గత ఏడాది నవంబర్ నెలలో బయటపెట్టింది. తాను కేరళ సీఎం పినరయి విజయన్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇవ్వాలని ,బంగారు స్మగ్లింగ్ తో ఆయనకు సంబంధం ఉందని మాకు స్టేట్ మెంట్ ఇవ్వాలని ఈడీ అధికారులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని స్వప్న సురేష్ ఆరోపించిందని ఆ ఆడియో, వీడియోలో ఉంది.

 అమ్మతోడు.... నువ్వు నిజంగా సేఫ్

అమ్మతోడు.... నువ్వు నిజంగా సేఫ్

బంగారు స్మగ్లింగ్ తో కేరళ సీఎం పినరయి విజయన్ కు సంబంధం ఉందని మాకు స్టేట్ మెంట్ ఇస్తే నిన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని ఈడీ అధికారులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ స్వప్న సురేష్ మాట్లాడింది. అంతే కాకుండా ఈడీ అధికారులు తయారు చేసిన స్టేట్ మెంట్ తాను పూర్తిగా చదవలేదని, తన మీద ఒత్తిడి చేసి బలవంతంగా తన సంతకం చేయించుకుని దానిని కోర్టులో సమర్పించారని ఆరోపిస్తూ స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో టేపులు నాలుగు నెలల క్రితమే బయటకు వచ్చాయి.

 అలా....చెబుతావా ?, జైల్లోనే ఉంటావా

అలా....చెబుతావా ?, జైల్లోనే ఉంటావా

బంగారు స్మగ్లింగ్ వ్యవహారం విషయంలోకే తాను యూఏఇకి వెళ్లానని, ఆ విషయం కేరళ సీఎంకు తెలుసని నువ్వు ఒప్పుకోవాలని, లేదంటే నీకు బెయిల్ రాకుండా చేసి నిన్ను జైలుకే పరిమితం చేస్తామని ఈడీ అధికారులు తన మీద ఒత్తిడి చేశారని స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో టేపులు బయటకు రావడం అప్పట్లో కేరళలో కలకలం రేపింది.

 మహిళా సెంట్రల్ జైల్లో సాధ్యమా ?

మహిళా సెంట్రల్ జైల్లో సాధ్యమా ?

తిరువనంతపురం మహిళా సెంట్రల్ జైల్లో స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో లేపులు, ఓ వీడియో ఎలా బయటకు వచ్చాయి, ఆమె మొబైల్ లో మాట్లాడటానికి ఎవరు సహాయం చేశారు ? అని విచారణ చెయ్యాలని కేరళ జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆదేశించారు. డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆదేశాలతో సౌత్ జోన్ డీఐజీ అజయ్ కుమార్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

 కేరళ క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీ

కేరళ క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీ

ఆ రోజు స్వప్న ఆడియో టేప్ దెబ్బతో ఈడీ అధికారులు సైతం ఆరోపణలు ఎదుర్కొవలసి వచ్చింది. స్వప్నా సురేష్ ఆరోపణలపై కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేశారు. ఇదే కేసులో స్వప్న సురేష్ ను కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ కు వ్యతిరేకంగా సాక్షం చెప్పాలని తనను ఈడీ అధికారులు బెదిరించారని స్వప్నా సురేష్ బాంబు పేల్చింది.

 ఈడీపై రివర్స్ కేసులు

ఈడీపై రివర్స్ కేసులు

జైల్లో ఉన్న స్వప్నా సురేష్ ను ఈడీ అధికారులు బెదిరించి కేరళ సీఎం పినరయి విజయన్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఈడీ అధికారుల మీద కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఓ సీఎంను కేసులో ఇరికించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఈడీ అధికారుల మీద ఐపీసీ సెక్షన్ 120-బి, 195-ఏ, 192, 167 సెక్షన్ ల కింద కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చెయ్యడం కలకలం రేపింది. ఇప్పుడు ఈడీ అధికారులు విచారణ ఎదుర్కోవడంతో గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం రసవత్తరంగా మారిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+