గౌతమ్ అదానికి బిగ్ షాక్: డిఫెన్స్ నుంచి అవుట్- కాంట్రాక్ట్ రెన్యూవల్ కు నో..

అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కీలక నిర్ణయం వెలువడింది. అదానితో ఒప్పందాలను పునరుద్ధరించుకోవడానికి స్వీడన్ డిఫెన్స్ సంస్థ నిరాకరించింది.

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఈ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఉభయ సభల రోజువారీ కార్యకలాపాలను స్తంభింపజేస్తోన్నాయి. దర్యాప్తు జరిపించడానికి అధికార పార్టీ ససేమిరా అంటోంది. ఎదురుదాడికి దిగుతోంది.

హిండన్ బర్గ్ నివేదిక వెలుగు చూసిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. రాజకీయంగా దుమారం రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది. అదానీతో రక్షణ పరికరాలు, ఫైటర్ జెట్ల తయారీ కోసం కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ను పొడిగించకూడదని నిర్ణయించినట్లు స్వీడన్ కు చెందిన డిఫెన్స్ కంపెనీ సాబ్ తెలిపింది. అదాని- సాబ్ కంపెనీల యాజమాన్యం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.

Sweden defence firm Saab parting ways with Adani Group and clarifies that it was mutual decision

దేశ వైమానికి దళానికి గ్రిపెన్- ఈ రకానికి చెందిన యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఇది. 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ లను తయారు చేయడానికి అదాని-సాబ్ మధ్య గతంలో ఈ ఒప్పందం కుదిరింది. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఈ 114 గ్రిపెన్-ఈ రకం ఫైటర్ జెట్లను తయారు చేయాల్సి ఉంది. దీని టెండర్ కోసం పోటీ పడుతున్న సంస్థల్లో స్వీడన్ కు చెందిన ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ.. సాబ్.

అదాని-సాబ్ మధ్య 2017లో ఈ ఒప్పందం కుదిరింది. 2019లో దీని గడువు ముగిసింది. గడువు ముగిసిన తరువాత కాంట్రాక్ట్ ను పునరుద్ధరించుకోవడానికి రెండు కంపెనీల మధ్య కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. అదే సమయంలో హిండన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్ట్ రెన్యూవల్ కు పుల్ స్టాప్ పడింది.

పరస్పర అంగీకారంతోనే తాము అదాని నుంచి విడిపోతున్నట్లు సాబ్ కంపెనీ భారత విభాగాధిపతి మాట్స్ పామ్‌బెర్గ్ తెలిపారు. 2019లో గడువు ముగిసిన ఎంఓయూను పునరుద్ధరించకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఇదివరకే సాబ్ కు అందజేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ కు బ్రేక్ పడినట్టయింది. గ్రిపెన్ ఫైటర్‌ జెట్లను సాబ్ కంపెనీ తయారు చేస్తోంది. మిగ్-21 కంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వీటి సొంతం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+