ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పార్లమెంటుకు తెలంగాణ బిల్లు

ఈ నెల 30 వరకు తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చకు రాష్ట్రపతి గడువు పొడిగించిన విషయం తెలిసిందే. 30తో శాసనసభలో చర్చ ముగుస్తుందని, అక్కడి నుంచి మూడు రోజుల లోపల అంటే ఫిబ్రవరి మూడవ తేదీ లోపల బిల్లుపై నివేదిక కేంద్ర హోంశాఖకు పంపించాల్సి ఉంటుందని, అక్కడి నుంచి రాష్ట్రపతికి వెలుతుందని, ఈ ప్రక్రియ అంతా పది రోజులు పడుతుందని కేంద్రహోంశాఖ భావిస్త్దోంది
ఇదిలావుంటే, అన్ని పార్టీలు అంగీకరించిన తర్వాతనే కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఎఐసిసి వర్గాలంటున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి 15 తేదీల మధ్య తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.
కిరణ్ కుమార్ రెడ్డి ఇదే వైఖరితో కొనసాగితే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారని ఎఐసిసి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి లాభం చేకూరుతుందని అంచనా వేస్తున్నాయి. తెలంగాణలోనూ సీమాంధ్రలోనూ కాంగ్రెసు నేతలు బలహీనపడ్డారని ఎఐసిసి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను సరిగా ఎదుర్కోలేకపోతున్నారని అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications