Afghanistan: ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్ల ప్రకటన... కొత్త అధ్యక్షుడి ముల్లా మహమ్మద్ హసన్...
ఆఫ్గనిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు అధికారిక ప్రకటన చేశారు. ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని ప్రకటించారు. డిప్యూటీ ప్రధాని లేదా అధ్యక్షుడిగా అబ్దుల్ ఘనీ బరాదర్,దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా సిరాజుద్దీన్ హక్కనీ వ్యవహరిస్తారని వెల్లడించారు. అయితే ఇది ఆపద్ధర్మ ప్రభుత్వమేనని... పర్మినెంట్ ప్రభుత్వం కాదని ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం(సెప్టెంబర్ 7) వివరాలు వెల్లడించారు.
కీలకమైన రక్షణ శాఖను తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు మహమ్మద్ యాకూబ్‌కు అప్పగించారు.ఆర్థిక శాఖను హెదాయతుల్లా బద్రికి అప్పగించారు. మొత్తం 33 మంది మంత్రులతో కొత్త కేబినెట్‌ను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది పష్తూన్ తెగకు చెందినవారే కావడం గమనార్హం. త్వరలోనే మరిన్ని శాఖలకు మంత్రులను ప్రకటిస్తామని జబీహుల్లా వెల్లడించారు.

ప్రభుత్వంలో అన్ని వర్గాలకు,గ్రూపులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు... ఆ మాటను నిలబెట్టుకున్నట్లుగా కనిపించట్లేదు.ముఖ్యంగా మహిళల విషయంలో వారి ధోరణి ఏమాత్రం మారలేదు. మహిళలకూ కేబినెట్‌లో చోటు కల్పించాలనే డిమాండ్లు,నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ తాలిబన్లు వాటిని పట్టించుకోవట్లేదు.
నిజానికి తాలిబన్లు గత శుక్రవారమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. హైబతుల్లా అఖుంద్‌జాదా సుప్రీం లీడర్‌గా.. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే అంతర్గత విభేదాలతో ప్రభుత్వ ఏర్పాటు వాయిదా పడింది. తొలుత శనివారానికి.. ఆ తర్వాత ఒక వారం పాటు ప్రభుత్వ ఏర్పాటును వాయిదా వేశారు.ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చల సందర్భంగా హక్కనీ నెట్‌వర్క్ నేతలకు,తాలిబన్ కీలక నేతలకు మధ్య ఘర్షణ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మధ్యే మార్గంగా... ముల్లా బరాదర్‌ను కాకుండా ముల్లా హసన్ పేరును అధ్యక్ష పదవి కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
తాలిబన్ సంస్థలో నిర్ణయాధికారం కలిగిన లీడర్‌షిప్ కౌన్సిల్ చీఫ్‌గా ప్రస్తుతం హసన్ కొనసాగుతున్నారు. హసన్ జన్మస్థలం కాందహార్. తాలిబన్ సంస్థ ఇక్కడే పురుడుపోసుకుంది. హసన్ గతంలో విదేశాంగ మంత్రిగా,డిప్యూటీ ప్రధానిగా పనిచేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications