నిన్న రష్మిక మందన్న..నేడు హీరో విజయ్: ఐటీ రెయిడ్స్: షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మరీ..!
చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే శాండల్ వుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై దాడులు చేపట్టిన ఐటీ అధికారులు తాజాగా విజయ్‌ని టార్గెట్ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. విజయ్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్, ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు.
విజయ్ హీరోగా ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ కింద బిగిల్ సినిమా తెరకెక్కింది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బడ్జెట్ సుమారు 120 కోట్ల రూపాయలుగా తేలింది. ఆ సందర్భంగా అన్బు చెలియన్ సహా ఏజీఎస్ సినిమాస్ సంస్థ నిర్వాహకులు పెద్ద మొత్తంలో ఆదాయపు పన్నులను లెక్క చూపలేదని చెబుతున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం విషయంలో సరైన సమాచారాన్ని ఇవ్వలేదనే కారణంతో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని అంటున్నారు.

తమిళనాడులోని మధురైలో అన్బు చెలియన్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిపై దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు. విస్తృతంగా సోదాలను నిర్వహిస్తున్నారు. కాగా- ప్రస్తుతం విజయ్ తన తదుపరి సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తోన్న మాస్టర్ మూవీ సెట్స్‌పై ఉంది. ఈ సినిమా షూటింగ్ కడలూర్ జిల్లాలోని నైవేలీలో కొనసాగుతోంది. ఆదాయపు పన్ను అధికారులు నైవేలికి వెళ్లి.. విజయ్‌ను ప్రశ్నిస్తున్నారు.
కర్ణాటకలోని విరాజ్‌పేటలో రష్మిక మందన్న నివాసంపై కొద్దిరోజుల కిందటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లెక్క చూపని నగదు, కొన్ని కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చోటు చేసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ సారి తమిళ మాస్ హీరో విజయ్‌పై ఐటీ అధికారులు నిఘా ఉంచడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం పుట్టించింది. షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మరీ ఆయనను ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
థాయ్ లాండ్ లో రష్మిక, విజయ్ హనీమూన్.. ఫోటో వైరల్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications