‘తెగించండి.. మారండి’: తొడలు కనిపించేలా తమిళ నవ వధువు!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కెనడాకు చెందిన సౌత్ ఏసియా వెడ్డింగ్ మేగజైన్ ప్రచురితం చేసిన తమిళ నవ వధువు ఫొటో ఇప్పుడు దుమారం రేపుతోంది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సాధారణంగా నవ వధువు చీరలో ముస్తాబవుతుంది. కానీ, ఇక్కడ మాత్రం చీరకట్టిన నవ వధువు తొడలు కనిపించేలా ఫొటోను ప్రచురితం చేసిందీ మేగజైన్.

మార్చి 13న జోడీ మేగజైన ఈ చిత్రాన్ని కవర్ ఫొటోగా ప్రచురితం చేసింది. మోడల్ థనుస్కా సుబ్రమణియన్.. పూలతో అలంకరించిన కూర్చీలో చీర కట్టుకుని కూర్చుంది. అయితే, ఆ చీర తొడలు కనిపించేలా రూపొందించడం విమర్శలకు తావిచ్చింది. తమిళ సంస్కృతిని కించపర్చేలా ఈ ఫొటో ఉందంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Tamil Bride Wearing Saree With Slit In Canadian Magazine Sparks Debate

'తెగించండి.. మారండి' అనే నినాదాన్ని ప్రచారం చేస్తున్న ఆ మేగజైన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. దక్షిణాసియా సంతతి ప్రజల కోసం వెలువడుతున్న కెనడా మేగజైన్ జోడీ సంప్రదాయానికి ఆధునికత జోడించే ప్రయత్నంలో ఈ దుమారాన్ని సృష్టించింది.

వధువు సంప్రదాయంగానే ఉన్నా చీరకట్టు క్యాబరే డ్యాన్సర్‌లా తొడలు కనిపించేలా ఉండటంతో చాలామంది నెటిజన్లు మేగజైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ వధువు ఎక్కడైనా ఇలా తయారవుతుందా? అంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. కాగా, కొందరు మాత్రం మేగజైన్ కవర్ ఫొటోపై సానుకూలంగా స్పందించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Canada based South Asian wedding magazine has sparked a debate online with its cover photo featuring a Tamil bride in a saree with a thigh high split. A photo of the 'Jodi' magazine cover, shared on March 13, has provoked wide ranging views on Facebook. While some have called the cover "a mockery of culture," others find it "tasteful and beautiful".
Please Wait while comments are loading...