తమిళ హీరో,డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి; పీఎం మోడీ, స్టాలిన్, ఖుష్బూ సంతాపం!!

తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. విజయ్ కాంత్ మృతిపై తమిళ చిత్ర పరిశ్రమతో పాటు, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ విజయ్ కాంత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ మరణం చాలా బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారు అని ప్రధాన నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

Tamil hero, DMDK leader Vijayakanth died; PM Modi, Stalin, Khushboo condolences

డిఎండికె వ్యవస్థాపకుడు విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. మా ప్రియ మిత్రుడు నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడ సంఘం కెప్టెన్ విజయ్ కాంత్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతి తో పాటు ఎంతో బాధను కలిగించిందని స్టాలిన్ పేర్కొన్నారు.

మంచి మనసున్న మిత్రుడు విజయ్ కాంత్ సినీ పరిశ్రమలోనూ ప్రజా జీవితంలోనూ తన కఠోరమైన శ్రమతో ఎన్నో విజయాలను అందుకుని ప్రజలపక్షాన నిలబడ్డారని స్టాలిన్ కొనియాడారు. నటుడుగా, నటీనటుల సంఘం అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా ఏ పని చేపట్టిన దానికే పూర్తిగా అంకితమై తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించారు అన్నారు. కుటుంబ స్నేహితుడిగా నాకు సుపరిచితుడని స్టాలిన్ విజయకాంత్ గొప్పతనాన్ని స్మరించుకున్నారు.

విజయ్ కాంత్ మృతి పట్ల నటి ఖుష్బూ సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ కాంత్ మరణం చాలా బాధాకరమని పేర్కొన్న ఆమె ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన లేని లోటు తీర్చలేనిదని ఖుష్బూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా తమిళనాడు ప్రభుత్వం విజయ్ కాంత్ అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. నేడు సంతాప దినంగా ప్రకటించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లలో సినిమా షో లను రద్దు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+