Viral Video: తమిళ జంట వెరైటీ వెడ్డింగ్: లాక్‌డౌన్ ఉన్నా..అంగరంగ వైభవంగా: భూమ్మీద కాదు
చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ దేశం మొత్తాన్నీ కమ్మేసింది. రోజూ వేలాదిమందిని పొట్టనబెట్టుకుంటోంది. మూడున్నర వేల నుంచి నాలుగు వేలకు పైగా రోజువారీ మరణాలు నమోదవుతోన్నాయి.కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి నాలుగైదు రాష్ట్రాల మినహా మిగిలినవన్నీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. లాక్‌డౌన్‌ను పొడిగించుకుంటూ వెళ్తోన్నాయి. నలుగురు వ్యక్తులు ఒకే చోటు గుమికూడి ఉండటంపై నిషేధం అమల్లో ఉంది. అందుకే పెళ్లిళ్ల వంటి శుభకార్యాల్లో వధూవరుల కుటుంబ సభ్యులు మినహా మరెవరికీ అనుమతి ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు.
ఈ పరిస్థితుల్లోనూ ఓ జంట అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవాన్ని జరుపుకొంది. 130 మంది బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు..పురోహితుడితో సహా. ఈ పెళ్లి జరిగింది భూమిపై కాదు.. గాల్లో. భూమికి సుమారు 22 వేల అడుగుల ఎత్తులో ఈ ఆ జంట ఒక్కటైంది. వారి పేర్లు రాకేష్, ధీక్షణ. తమిళనాడులోని మధురైకి చెందిన వధూవరులు వారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో వారి తరఫు కుటుంబాలు ఏకంగా విమానాన్నే బుక్ చేసుకుని, అందులో వివాహాన్ని జరిపించారు.

మధురై నుంచి తూత్తుకుడి వెళ్లడానికి స్పైస్ జెట్ విమానం మొత్తాన్నీ వారు అద్దెకు తీసుకున్నారు. 130 మందితో ఆ విమానం తూత్తుకుడికి బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యలో రాకేష్.. ధీక్షణ మెడలో తాళి కట్టాడు. పెళ్లి చేసుకోవడానికే విమానాన్ని అద్దెకు తీసుకున్నారనే విషయం మధురై ఎయిర్‌పోర్ట్ అధికారులకు తెలియదు. పెళ్లి చేసుకోవడానికి విమానాన్ని అద్దెకు తీసుకున్నారనే సమాచారం తమకు తెలియదని మధురై ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వెల్లడించారు. విమానాన్ని ఎక్కడానికి ముందు తాము ఆర్టీపీసీఆర్ కోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను జరిపించుకున్నామని, అందరికీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని రాకేష్, ధీక్షణ తరఫు బంధువులు చెబుతున్నారు.














Click it and Unblock the Notifications