నిండా మునిగి జయకు విజయకాంత్ హెల్ప్
చెన్నై: తమిళనాడులో అన్నా డీఎంకే అధికారంలోకి రావడానికి ఏడీఐఎంకే అధినేత, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ పరోక్షంగా సహకరించాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయ్ కాంత్ పూర్తిగా మునిగిపోవడమే కాకుండ డీఎంకే చీఫ్ కరుణానిధిని నిలువునా ముంచేశాడని అంటున్నారు.
విజయ్ కాంత్ ఓట్లు చీల్చడం వలనే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన అన్నా డీఎంకే అభ్యర్థులను గెలిపించుకుంటున్నారని చెబుతున్నారు. అంతా అయిన తరువాత ఇప్పుడు విజయ్ కాంత్ తో పాటు, కరుణా నిధి ఇంటికే పరిమితం అయ్యారని, అధికారంలోకి వస్తామని వారు ఇప్పటి వరకు ఊహించిన కలలు నెరవేరలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తమిళనాడులోని పలు శాసన సభ నియోజక వర్గాల్లో విజయ్ కాంత్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య కూటమి పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు. అనేక శాసన సభ నియోజక వర్గాల్లో భారీగానే ఓట్లు సంసాధించుకుని రెండవ స్థానంలో నిలిచారు. పలు చోట్ల మూడవ స్థానానికే పరిమితం అయ్యారు.

క్యాప్టెన్ కు అంత సీన్ లేదు
పలు పార్టీల నాయకులు ఎన్నికల ముందు విజయ్ కాంత్ చుట్టు ప్రదక్షణలు చేశారు. మా పార్టీకి మద్దతు ఇవ్వాలని వేడుకున్నారు. అయితే ఆయన ఎవ్వరి మాట వినలేదు.

నేనే ముఖ్యమంత్రి అవుతా
తానే ముఖ్యమంత్రి అవుతానని, అందుకు అవకాశం ఇస్తే మీ పార్టీకి మద్దతు ఇస్తానని విజయ్ కాంత్ చెట్టు ఎక్కి కుర్చున్నారు. అయితే తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది.

డీఎంకే ఆహ్వానం స్వీకరించి ఉంటే
డీఎంకే అధినేత కరుణానిధి స్వయంగా విజయ్ కాంత్ తో మాట్లాడారు. తమ పార్టీతో కలిసి పోటీ చేస్తే అధికారంలోకి వచ్చిన తరువాత మీకు సముచిత స్థానం కల్పిస్తామని క్యాప్టెన్ కు హామీ ఇచ్చారు.

ఉప ముఖ్యమంత్రి పదవి కావాలి
డీఎంకే తో కలిసి తాము ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని విజయ్ కాంత్ ఒంటికాలి మీద నిలబడ్డారు.

చివరికి చెడింది
విజయ్ కాంత్ గొంతెమ్మ కోర్కోలు తీర్చలేని డీఎంకే నాయకులు ఆయనను దూరం పెట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు.

ఓట్లు చీల్చిన క్యాప్టెన్
గురువారం తమిళనాడులో ఓట్ల లెక్కి జరిగింది. పలు చోట్లు డీఎంకే అధిక శాతంలోనే ఓట్లు సంపాధించింది. అయితే ఏడీఎంకే అభ్యర్థులు ఓట్లు చీల్చి మూడవ స్థానంలో నిలబడ్డారు.

అన్నాడీఎంకే కంటే ఎక్కువ శాతం ఓట్లు.
తమిళనాడులోని పలు శాసన సభ నియోజక వర్గాల్లో అన్నా డీఎంకే అభ్యర్థులు సాధించిన ఓట్లు, డీఎంకే, ఏడీఎంకే అభ్యర్థుల ఓట్లు తెలుసుకుంటే దిమ్మ తిరుగుతుంది, అన్నా డీఎంకే కంటే డీఎంకే, ఏడీఎంకే ఓట్లు కలుపుకుంటే ఎక్కువ శాతం ఉన్నాయి.

కలిసి ఉంటే కలదు సుఖం
విజయ్ కాంత్ కరుణానిధికి మద్దతు ఇచ్చి ఉంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండే వారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకరి మీద ఒకరు పంతానికి పోయి ఇప్పుడు తలలు పట్టుకున్నారని అంటున్నారు.

అమ్మ మీద వ్యతిరేత
అధికారంలో ఉన్న అన్నా డీఎంకే మీద వ్యతిరేకత అక్కడక్కడా ఉంది. అయితే డీఎంకే ఓటు బ్యాంకును క్యాప్టన్ చీల్చడంతో జయలలితకు కలిసి వచ్చింది.

కరుణానిధి ఆశల మీద నీళ్లు చల్లిన క్యాప్టెన్
కరుణానిధి తాను ముఖ్యమంత్రి అవుతానని ఆశపడ్డారు. ప్రజలు ఆయనకు సానుకూలంగానే స్పందించారు. అయితే పలు నియెజక వర్గాల్లో విజయ్ కాంత్ ఆధ్వర్యంలోని ప్రజకూటమి అభ్యర్థులు ఓట్లు చీల్చడంతో కరుణానిధి ఆశలు గల్లంతు అయ్యాయి.












Click it and Unblock the Notifications