చిన్నమ్మ కోసం.. బెంగళూరు జైలుకు తమిళ సీఎం పళనిసామి
చెన్నై/బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎడప్పాడి పళనిసామి చిన్నమ్మ శశికళ నటరాజన్ ఆశీస్సులు తీసుకోవడానికి బెంగళూరు బయలుదేరడానికి సిద్దం అయ్యారు. సీఎం పళనిసామితో సహ పలువురు మంత్రులు బెంగళూరు చేరుకోనున్నారు.
శుక్రవారం చెన్నై నుంచి ప్యతేక విమానంలో తమిళనాడు సీఎం పళనిసామి తదితరులు బయలుదేరి బెంగళూరులోని హెచ్ఏఎల్ ఏయిర్ పోర్టు చేరుకుంటారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. తరువాత బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలు దగ్గరకు చేరుకుని చిన్నమ్మ దగ్గర పళనిసామి ఆశీర్వాధం తీసుకోనున్నారు.

తమిళనాడు పశుసంవర్థక శాఖా మంత్రి బాలకృష్ణారెడ్డి హోసూరు నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలను భారీ సంఖ్యలో పరప్పన అగ్రహార జైలు దగ్గరకు తరలించడానికి ఇప్పటి నుంచి తన అనుచరులతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎంగా మొదటి సారి తన నియోజక వర్గం హోసూరు సమీపంలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గరకు వస్తున్న ఎడప్పాడి పళనిసామికి ఘనంగా స్వాగతం పలకడానికి మంత్రి బాలకృష్ణారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications