ఆసుపత్రిపాలైన తమిళనాడు సీఎం జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత (68) ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డీహైడ్రేషన్ కారణగా ఆమెను శుక్రవారం నాడు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
అరవై ఎనిమిదేళ్ల అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు. ఆమెను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
ఆమె ఆరోగ్యం గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి. జయలలితను ఈ రోజు మధ్యాహ్నం ఇంటికి పంపించనున్నారని తెలుస్తోంది.

జయలలిత వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఆమె పైన ఆస్తుల కేసు దర్యాఫ్తు జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలారోజులుగా ఆమె ఆరోగ్యం పైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధి (92).. జయలలిత ఆరోగ్యం గురించి క్లారిఫికేషన్ కోరిన సందర్భం కూడా ఉంది.
ఈ ఏడాది తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో జయలలిత మరోసారి గెలుపొందారు. ఆమె ఓడిపోతుందని, ఆ తర్వాత గెలుస్తుందని ఎన్నో వాదనలు వినిపించాయి. కానీ ఆమె నేతృత్వంలోని అన్నాడీఎంకే గెలుపొందింది.
జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే, తమిళనాడులో 32 ఏళ్ల తర్వాత మొదటిసారి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది అన్నాడీఎంకే మాత్రమే. ఆమె మే నెలలో ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications