వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితను కుర్చి నుండి దించాలి: కర్ణాటక

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపణలు ఎదుర్కుంటున్నతమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితను కుర్చి నుండి కిందకు దించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నది. జయలలిత అక్రమ ఆస్తుల కేసు తీర్పును సవాలు చేస్తు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

సుప్రీం కోర్టులో సమర్పించిన అప్పీలులో కర్ణాటక ప్రభుత్వం రెండు వేర్వేరు విజ్ఞప్తులు చేసింది. జయలలిత అక్రమాస్తులు కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అమలు చేసిన నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానాను అమలు చెయ్యాలని మొదటి విజ్ఢప్తిని చేసింది.

Tamil Nadu Chief Minister Jayalalithaa case in supreme court

జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చెయ్యాలని, ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన శిక్షను అమలు చెయ్యాలని రెండవ మద్యంతర మనవి చేసింది. సుప్రీం కోర్టు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేస్తే జయలలిత మళ్లి కుర్చి దిగవలసి వస్తుంది.

సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తరువాత పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తరువాత కర్ణాటక హైకోర్టు తీర్పును రద్దు చేసి కేసు కొట్టి వెయ్యడంతో జయలలిత మళ్లి సీఎం అయ్యారు. చెన్నయ్ లోని ఆర్ కే నగరలో జరిగే ఉప ఎన్నికలలో జయలలిత పోటి చేస్తున్నారు.

English summary
The Karnataka Government appeal filed before the Supreme Court in the Jayalalithaa case has two prayers. While the interim prayer is to restore the order of the trial court which will make her ineligible to continue as the Chief Minister of Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X