జయకు ఏమైయ్యింది ? ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది ? మద్రాస్ హైకోర్టు

చెన్నై: తమిళనాడు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి అని మద్రాసు హై కోర్టు ప్రశ్నించింది. జయలలిత ఆరోగ్యంగా లేనప్పుడు ప్రభుత్వ పాలన ఎవరి చేతుల్లో ఉంది చెప్పాలని ఆదేశించింది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఏమి చెప్పడం లేదని, ప్రజలు ఆయోమయానికి గురౌతున్నారని, గంటగంటకు పుకార్లు ఎక్కువ అవుతున్నాయని ఆరోపిస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.

 జయలలితకు ఏమైయ్యింది

జయలలితకు ఏమైయ్యింది

బుధవారం మద్రాస్ హై కోర్టు పిటిషన్ ను విచారించింది. ఈ సందర్బంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏమైయ్యింది అని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సుందరేశన్, న్యాయమూర్తి మగదేవన్ నేతృత్వంలోని ధ్విసభ్య బెంచ్ ప్రశ్నించింది.

 బులిటెన్ విడుదల చేస్తున్నారు

బులిటెన్ విడుదల చేస్తున్నారు

తమిళనాడు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ మణిశంకర్ మాట్లాడుతూ సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అపోలో ఆసుపత్రి చీఫ్ డాక్టర్ సుబ్బయ్య విశ్వనాథన్ ఎప్పటికప్పుడు జయలలిత ఆరోగ్యం గురించి బులిటెన్ విడుదల చేస్తున్నారని అన్నారు.

 పుకార్లు వింటున్నారు

పుకార్లు వింటున్నారు

జయలలిత గురించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాల వల్ల అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అపోలో ఆసుపత్రి విడుదల చేసిన బులిటెన్లు ఇవే అని అడ్వకేట్ జనరల్ మణిశంకర్ కోర్టు కు బులిటెన్ వివరాలు అంధించారు.

 ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు

ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు

జయలలిత అనారోగ్యంతో భాదపడుతుంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారని మద్రాస్ హై కోర్టు ప్రశ్నించింది. ఇన్ని రోజులు ప్రభుత్వ వ్యవహారాలు ఎవరూ చూస్తున్నారు చెప్పండి అని ప్రశ్నించింది.

ప్రభుత్వంతో మాట్లాడాలి

ప్రభుత్వంతో మాట్లాడాలి

అడ్వకేట్ జనరల్ మణిశంకర్ మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడిన తరువాత తాను పూర్తి సమాచారాన్ని చెబుతానని కోర్టుకు మనవి చేశారు. ప్రభుత్వంతో మాట్లాడిన తరువాత కచ్చితమైన వివరాలు వెల్లడించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది.

ఒక్క రోజు గడువు ఇస్తున్నాం

ఒక్క రోజు గడువు ఇస్తున్నాం

తమిళనాడు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పడానికి ఒక్క రోజు గడువు ఇస్తున్నామని మద్రాస్ హై కోర్టు చెప్పింది. పిటిషన్ విచారణ గురువారానికి వాయిదా వేసింది. తమిళనాడు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు అనే విషయం గురువారం అడ్వకేట్ జనరల్ మణిశంకర్ మద్రాస్ హై కోర్టులో చెప్పవలసి ఉంది.

 నన్ను ఎవ్వరూ బెదిరించలేదు

నన్ను ఎవ్వరూ బెదిరించలేదు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య వివరాలు వెల్లడించాలని మద్రాస్ హై కోర్టులో పిటిషన్ వేసినందుకు తనను ఎవరూ ఫోన్ చేసి బెదిరించలేదని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి చెప్పారు.

 ఇప్పుడు ఏం చేద్దాం

ఇప్పుడు ఏం చేద్దాం

మద్రాస్ హై కోర్టుకు ఏం సమాధానం చెబుతాం అని తమిళనాడు ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. అన్ని తానై చూసుకుంటున్న సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉండటంతో అన్నాడీఎంకే నాయకులు ఆందోళన చెందుతున్నారు.

 అలర్ట్ అయిన డీఎంకే

అలర్ట్ అయిన డీఎంకే

జయలలిత ఆరోగ్యం విషయంలో ప్రతిపక్ష పార్టీ డీఎంకే అన్ని గమనిస్తుంది. ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉందని అని డీఎంకే కూపీలాగుతుంది. ఇది ఇలా ఉంటే ఎప్పుడు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అన్నాడీఎంకే కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+