వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వం పదవికి ఎసరు ? ఢిల్లీకి పరుగో పరుగు

తమిళనాడు ముఖ్యమంత్రి పదవి శశికళకు కట్టబెట్టాలని అన్నాడీఎంకేలోని ఓ వర్గం ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆ రాష్ట్ర సీఎం పన్నీర్ సెల్వం ఇప్పుడు ఢిల్లీకి పరుగు తీశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పదవికి ఎసరు పెట్టడానికి పలువురు సినియర్ మంత్రులు సిద్దం అయ్యారు. సీఎం పగ్గాలు శశికళకు అప్పగించాలని ఇప్పటికే బహిరంగంగా చెప్పడంతో అన్నాడీఎంకేలో వర్గ పోరు మొదలైయ్యింది.

ఇదే సమయంలో సీఎం పన్నీర్ సెల్వం ఢిల్లీకి పరుగు తీయ్యడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషిస్తున్న జయలలిత పెరవై ఇప్పుడు శశికళకు పూర్తి మద్దతు ప్రకటించింది.

జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీలో రాజకీయ నాటకాలు మొదలైనాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని శశికళ కాళ్ల మీద వేడుకోలు పర్వాలు సాగుతున్నాయి.

శశికళకు హై కోర్టు నోటీసులు: పదవికి అర్హత ఉందా ? ఎందుకంటే !

అమ్మలో మిమ్మల్ని చూసుకుంటామని అంటున్నారు. అయితే అంతా చిన్నమ్మ దర్శకత్వంలోనే ఈ నాటకాలు మొదలైనాయని ఆరోపణలు వస్తున్నాయి. పలువురు సీనియర్ మంత్రులు సైతం పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా మాట్లాడుతూ శశికళ సీఎం కావాలని బహిరంగంగానే చెబుతున్నారు.

ఇప్పుడు జయలలిత పెరవై తెరమీదకు తెచ్చిన సీఎం పదవి నినాదం అన్నాడీఎంకే పార్టీతో పాటు తమిళనాడులో పెద్ద చర్చకు దారి తీసింది. శశికళకు ఏమీ అనుభవం ఉందని సీఎం పగ్గాలు అప్పగించాలి ? అని పన్నీర్ సెల్వం వర్గీయులు వాదిస్తున్నారు.

Tamil Nadu Chief Minister O Panneerselvam left for New Delhi

ఢిల్లీకి పరుగు తీసిన పన్నీర్ సెల్వం !

తమిళనాడు ముఖ్యమంత్రి పదవి శశికళకు కట్టబెట్టాలని అన్నాడీఎంకేలోని ఓ వర్గం ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆ రాష్ట్ర సీఎం పన్నీర్ సెల్వం ఇప్పుడు ఢిల్లీకి పరుగు తీశారు. జయలలిత మరణించిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ జోక్యంతో అమ్మ పదవి పన్నీర్ సెల్వం చేతికి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

అన్నాడీఎంకేలో అమ్మ జయలలిత తరువాత నెంబర్ టూగా వ్యవహరించిన పన్నీర్ సెల్వంను ఎదురించి ఇప్పుడు చాల మంది మంత్రులు చిన్నమ్మకు జై కోడుతున్నారు. ఈ దెబ్బతో సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులు ఆందోళనకు గురైనారు.

చాలెంటజ్: దమ్ముంటే జయ మృతి కేసు సీబీఐకి ఇవ్వండి !

ఇదే సమయంలో పన్నీర్ సెల్వం ఢిల్లీకి పరుగు తియ్యడంతో అన్నాడీఎంకేలోని ఆయన వర్గీయులు హడలిపోతున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం భేటీ కానున్నారు.

వర్ద తాండవంతో ఏర్పడ్డ నష్టాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్లడానికి ఇప్పటికే నివేదిక సిద్దం చేసుకుని పన్నీర్ సెల్వం తన వెంట తీసుకు వెళ్లారు. తమిళనాడుకు నిధులు కేటాయించే విషయంలో ప్రధాని మోడీతో చర్చ జరగనుంది.

తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలని, పార్లమెంట్ ఆవరణంలో జయలలిత నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చెయ్యనున్నారు.

అయితే తన సీటుకు ఎసరు పెట్టడానికి పలువురు సీనియర్ మంత్రులు బహిరంగంగా ప్రకటనలు చెయ్యడంతో సీఎం పదవి కాపాడుకోవడానికి పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లారని మీడియాలో ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తరువాత తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం మీడియాతో ఏం మాట్లాడుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
Tamil Nadu Chief Minister O Panneerselvam left for New Delhi this morning, to meet Prime Minister Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X