శశికళకు చెక్: దినకరన్ ఎత్తులకు సీఎం పళనిసామి పైఎత్తులు, విలీనంపై నేడు నిర్ణయం !
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ పగ్గాలు చేపట్టాలని టీటీవీ దినకరన్ ఎత్తులు వేస్తున్నాడు.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ పగ్గాలు చేపట్టాలని టీటీవీ దినకరన్ ఎత్తులు వేస్తున్నాడు. టీటీవీ దినకరన్ ఎత్తులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి పై ఎత్తులు వేస్తున్నారు.
ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టాలని, పార్టీ పగ్గాలు చేపట్టాలని టీటీవీ దినకరన్ ప్లాన్ వేశారు. టీటీవీ దినకరన్ ఎత్తులు చిత్తు చెయ్యాలని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి ఆగస్టు 1వ తేదీ మంగళవారం పార్టీ కార్యాలయంలో అడుగుపెడుతున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు
మంగళవారం సాయంత్రం 5 గంటలకు మంత్రులు, అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెలు, తమిళనాడులోని అన్ని జిల్లాల నాయకులు సమావేశానికి హాజరుకావాలని ఎడప్పాడి పళనిసామి పిలుపునిచ్చారు. అందరినీ ఏకతాటి మీదకు తీసుకు వచ్చి టీటీవీ దినకరన్ ను ఏకాకిని చెయ్యాలని పళనిసామి ప్లాన్ వేశారు.
Recommended Video


పన్నీర్ సెల్వం వర్గంతో
అన్నాడీఎంకే పార్టీలోని ఎడప్పాడి పళనిసామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం విలీన చర్చలు మళ్లీ తెరమీదకు వచ్చిన సమయంలో ఎడప్పాడి పళనిసామి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల నాయకులతో సమావేశం ఏర్పాటు చెయ్యడం చర్చకు దారి తీసింది.

రాజీ చేసిన ప్రధాని మోడీ ?
ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు వేర్వేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తరువాత రెండు శిభిరాల మధ్య రాజీ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది.

ముహుర్తం పెట్టిన మోడీ !
ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించిన ముహుర్తానికి రెండు వర్గాలు విలీనం కావాలని చర్చలు జరుగుతున్న సమయంలో టీటీవీ దినకరన్ కొత్త అడుగులు వేస్తున్నాడు. ఇదే సమయంలో టీటీవీ దినకరన్ కు చెక్ పెట్టడానికి ఎడప్పాడి పళనిసామి, మంత్రులు సిద్దం అయ్యారు.

అసమ్మతి ఎమ్మెల్యేలకు గాలం !
ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ ఇంటి వైపు అడుగులు వేస్తున్నారు. వారిని దారిలోకి తీసుకురావడానికి ఎడప్పాడి పళనిసామి ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే సమావేశానికి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారు ? అనే విషయం వేచి చూడాలని అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications