వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితకు ఆ సమస్య ఉంది: హెల్త్ బులిటెన్ ఇదే !

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని అపోలో ఆసుపత్రి చీఫ్ డాక్టర్ సుబ్బయ్య విశ్వనాథన్ వెల్లడించారు. ఈ సందర్బంగా సోమవారం అర్దరాత్రి అపోలో ఆసుపత్రి జయలలిత ఆరోగ్యంపై బులిటెన్ ను విడుదల చేసింది.

మొదటి సారి జయలలితకు ఉన్న సమస్య ఏమిటి ? అని అపోలో ఆసుపత్రి స్పష్టం చేసింది. జయలలిత శ్వాసకోస వ్యాదితో భాదపడుతున్నారని, ఆమెకు ఐసీయూలో నెబులైజేషన్ చికిత్స (మాస్క్ సహాయంతో ఆక్సిజన్ ఇవ్వడం) చేస్తున్నామని డాక్టర్ సుబ్బయ్య విశ్వనాథన్ వెల్లడించారు.

జ్వరంతో

జ్వరంతో

12 రోజుల క్రితం జయలలిత జ్వరంతో అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అపోల్ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ సుబ్బయ్య విశ్వనాథన్ తో కూడిన ప్రత్యేక బృందం జయలలితకు వైద్యం చేస్తున్నారు.

లండన్ వైద్యుడు

లండన్ వైద్యుడు

అధే విధంగా లండన్ నుంచి వచ్చి డాక్టర్ రిచర్డ్ బెలే జయలలితకు వైద్యం సేసి తిరిగి లండన్ వెళ్లిపోయాడని డాక్టర్ సుబ్బయ్య విశ్వనాథన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని సుబ్బయ్య విశ్వనాథన్ వెల్లడించారు.

ఆసుపత్రిలో ఉండాలి

ఆసుపత్రిలో ఉండాలి

జయలలితకు జ్వరం కారణంగా ఇన్ ఫెక్షన్ సొకింది. ఆమె పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా 10 రోజులు పడుతుందని, అంతవరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకోవాలని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.

 క్యూ కడుతున్నారు

క్యూ కడుతున్నారు

ఆసుపత్రి దగ్గర అన్నాడీఎంకే నాయకుల హడావిడి ఎక్కువ కావడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన రోగులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అన్నాడీఎంకే ప్రముఖులకు అపోలో ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక పాసులు ఇచ్చారు.

నిషేదాజ్ఞలు

నిషేదాజ్ఞలు

మరో వైపు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు విధించారు. ఆసుపత్రి దగ్గరకు వచ్చి అమ్మకు ఇబ్బంది కలిగించే పనులు చెయ్యరాదని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళనలు వద్దని అన్నాడీఎంకే నాయకులు పార్టీ కార్యకర్తలకు మనవి చేస్తున్నారు.

పోలీసు అధికారులు మకాం

పోలీసు అధికారులు మకాం

దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు అమ్మను చూడాలంటూ ఆసుపత్రి దగ్గర పడిగాపులుకాస్తున్నారు. అమ్మ చికిత్స పొందుతున్న ఆసుపత్రి దగ్గర చెన్నై నగర పోలీసు అధికారులు మకాం వేశారు.

English summary
Apollo hospital health bulletin on Jayalalithaa creat confusion among people of Tamilnadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X