వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితకు కోపం: ఊడిన మంత్రి పదవి

|
Google Oneindia TeluguNews

చెన్నయ్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత తన మంత్రి వర్గంలో ఒకరికి ఉద్వాసన పలికారు. తమిళనాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఇంటికి పంపించారు. మంత్రి పదవితో పాటు ఆయనకు పార్టీ నామినేటెడ్ పదవి ఊడిపోయింది.

సెంథిల్ కుమార్ ను మంత్రి పదవి నుండి తప్పించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన మనవికి ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ఆమోద ముద్ర వేశారని సోమవారం రాజ్ భవన్ వర్గాలు ధ్రువీకరించాయి. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి తంగమణికి రవాణా శాఖను అప్పగించారు.

Tamil Nadu CM Jayalalithaa Drops Senthil Balaji From Her Cabinet

సెంథిల్ బాలాజీ కరూర్ జిల్లా అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. కరూర్ జిల్లా కారద్యర్శి పదవి నుండి ఆయనను తప్పించారు. అయితే ఆయన మంత్రి పదవి, పార్టీ పదవి పోవడానికి కచ్చితమైన కారణాలు మాత్రం బయటకు రావడం లేదు.

2011 నుండి సెంథిల్ బాలాజీ మంత్రిగా పని చేస్తున్నారు. జయలలిత జైలుకు వెళ్లిన తరువాత ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. జయలలిత జైలు నుండి విడుదల కావాలని రాష్ట్రవ్యాప్తంగా సెంథిల్ బాలాజీ ప్రత్యేక పూజలు చేయించారు. అయితే అన్నా డీఎంకే చీఫ్ జయలలిత ఒక్క సారి నిర్ణయం తీసుకుంటే ఇంతే మరి.

English summary
Tamil Nadu Chief Minister J Jayalalithaa today axed Transport Minister V Senthil Balaji from her cabinet, besides stripping him of a powerful party post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X