ఎయిరిండియా విమానం సేఫ్ ల్యాండింగ్: సీఎం స్టాలిన్ హర్షం, వారికి అభినందనలు

ఎయిర్ ఇండియా విమానం తిరుచ్చిలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం కారణంగా పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, దాదాపు రెండు గంటలకుపైగా గాల్లోనే చక్కర్లు కొట్టిన అనంతరం ఎయిరిండియా విమానం తిరుచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు.

ఎయిరిండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వార్త విని ఎంతో సంతోషించినట్లు ఎంకే స్టాలిన్ తెలిపారు. విమానం గాల్లో ఉండగా.. పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వార్తలు విన్న వెంటనే ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడి వారితో సమన్వయం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

Tamil Nadu CM Stalin Lauds Safe Landing of Air India Flight

ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా అంబులెన్స్ లు, ఫైరింజిన్లు, వైద్య సహయాంతో సహా అవసరమైన అన్ని భద్రతా చర్యలను పాటించాలని సూచించినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారందరినీ సురక్షితంగా చేర్చేందుకు తగిన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినందుకు పైలట్, సిబ్బందికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందనలు తెలిపారు.

ఉత్కంఠ మధ్య సురక్షితంగా ల్యాండైన విమానం

ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయడం లేదంటూ తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు పైలట్లు. తమిళనాడులోని తిరుచ్చి మీదుగా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో తిరుచ్చి విమానాశ్రయంలో సురక్షిత ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ల్యాండింగ్‌కు అరగంట సమయం పట్టనుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ విమానం ల్యాండింగ్ పై ఉత్కంఠ నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ల్యాండింగ్ కావాలంటే అందులో ఉన్న ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాల్సి ఉంటుంది. అప్పుడు విమానం ల్యాండింగ్ చేసే వీలుంటుంది.

ఈ నేపథ్యలో సురక్షిత ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన పైలట్లు.. దాదాపు రెండు గంటలకుపైగా గాల్లోనే తిప్పారు. కాగా, రెండు గంటలుగా గాల్లోనే తిరిగిన ఎయిర్ ఇండియా విమానం చివరకు తిరుచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండైంది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది, అధికారులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఎయిరిండియా విమానం AXB 613 తిరుచ్చి నుంచి షార్జాకు శుక్రవారం సాయంత్రం బయల్దేరింది. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఏటీసీకి తెలియజేయడంతో అప్రమత్తమైన అధికారులు.. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిచ్చారు.

ఈ క్రమంలో సురక్షిత ల్యాండింగ్ కోసం దాదాపు రెండు గంటలపాటు గాల్లోనే తిరిగిన ఎయిరిండియా విమానం.. చివరకు శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరుచ్చి విమానాశ్రయంలో సుక్షితంగా ల్యాండైంది. కాగా, ఎయిరిండియా విమానంలో తిరుచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయదశమి పర్వదినం వేళ పెను ప్రమాదం తప్పిందంటూ అమ్మవారిని తలచుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+