పరువు హత్యల భయం: ఐసీయూలో నవ జంట

కోయంబత్తూరు: తల్లిదండ్రులు చంపేస్తారని (పరువు హత్యలు) భయంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన సంఘటన తమిళనాడులో జరిగింది.

పోలాచ్చిలో గౌతం, ప్రీతి నివాసం ఉంటున్నారు. వీరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు. పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయించారు.

చివరికి వీరి పెళ్లికి ప్రీతి కుటుబ సభ్యులు అంగీకరించారు. అయితే గౌతం కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. వేరే కులం అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని నిలదీశారు.

Tamil Nadu couple tries commit suicide by consuming rat poison

రెండు నెలల క్రితం ఇద్దరూ ఊరు వదిలి పారిపోయారు. కోయంబత్తూరులో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వీరిద్దరిని ఒకటి చేశారు. అయితే తన తండ్రి మమల్ని విడదీస్తాడని, పరువు హత్యలకు పాల్పడుతాడని గౌతమం భయపడ్డాడు.

ప్రీతి లేని జీవితం వద్దని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. అయితే ప్రీతి భర్తను వారించకుండా తాను నీతోనే కలిసి ఆత్మహత్య చేసుకుంటానని గౌతంకు చెప్పింది.

ఈనెల 12వ తేదిన కోయంబత్తూరు సమీపంలో ఇద్దరూ ఎలుకల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే ఇద్దరిని ఆసుపత్రికితరలించారు.

సరైన సమయంలో స్థానికులు స్పందించడంతో ఇద్దరూ ప్రాణాలతో భయటపడ్డారు. ఇద్దరూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు.

ప్రీతి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారని, గౌతం కుటుంబ సభ్యులు అంగీకరించలేదని పోలీసులు అన్నారు. తాము గౌతం, ప్రీతిలకు అండగా ఉంటామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+