శశికళ సీఎం, పన్నీర్ సెల్వంకు ఇవ్వబోయే పదవి ఇదే !
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా మంగళవారం ఉదయం 8.45 గంటలకు మద్రాసు వర్శిటీ సెంటినరీ హాల్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు. శశికళ కోసం సీఎం పదవి త్యాగం చేసిన పన్నీర్ సెల్వంకు సముచిత పదవి ఇవ్వనున్నారని తెలిసింది.
పన్నీర్ సెల్వంను ఉప ముఖ్యమంత్రి పదవిలో నియమించనున్నారని శశికళ వర్గీయులు చెబుతున్నారు. శశికళ కేబినెట్ లో పన్నీర్ సెల్వానికి కీలక ఫోర్టుపోలియో దక్కే అవకాశం ఉందని చిన్నమ్మను గ్యాంగ్ లోని మంత్రులు అంటున్నారు.

అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీం కోర్టు తీర్పు గండం వెంటాడుతున్న విషయం తెలిసిందే. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా సహ నిందితురాలు. జయలలిత అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేసిన ప్రత్యేక న్యాయస్థానం జయలలితతో పాటు శశికళ తదితరులకు జైలు శిక్ష విధించింది.
తరువాత కర్ణాటక హైకోర్టు ఈ కేసు ను కొట్టేసి జయలలిత, శశికళ నటరాజన్ తదితరులను నిర్దోషులుగా విడుదల చేసింది. కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వారంలో ఈ కేసు తీర్పు వెలువరిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications