వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరి చర్చలు విఫలం: నిరాహార దీక్ష చేస్తా, ఉమా భారతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కావేరీ జలాల పంపిణి విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలను రాజీ చెయ్యడానికి ప్రయత్నించింది. అయితే కర్ణాటక తెరమీదకు తెచ్చిన ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది.

గురువారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తమిళనాడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఎడప్పడి కే. పళని, రెండు రాష్ట్రాల అధికారులు హాజరైనారు.

కావేరీ జలాలు ఎన్ని టీఎంసీలు ఉన్నాయి, ఎలా పంపిణి చెయ్యాలని అని పరిశీలించడానికి నిపుణుల కమిటీని పంపించాలని సిద్దరామయ్య మనవి చేశారు. అయితే ఆ ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం అంగీకరించలేదు. తమిళనాడుకు కావేరీ నీరు వదిలి పెట్టాలని పట్టుబట్టింది.

Tamil Nadu did not accept Karnataka's proposal

రెండు రాష్ట్రాలు శాంతియుతంగా కావేరీ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఉమాభారతీ సూచించారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. సమావేశం అనంతరం ఉమాభారతి మీడియాతో మాట్లాడారు.

సమావేశంలో చర్చించిన అంశాలన్నీఅటర్నీ జనరల్ ద్వారా తాము సుప్రీం కోర్టుకు సమాచారం ఇస్తామని స్పష్టం చేప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని, కావేరీ జలాల కోసం ఆందోళనలు చెయ్యరాదని ఉమాభారతీ మనవి చేశారు.

అయితే ఈ విషయంపై ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే తాను నిరాహారదీక్ష చేస్తానని ఉమా భారతి అన్నారు. తాను బెదిరించడానికి ఇలా చెప్పడం లేదని చెప్పారు. కోర్టు బయట రాజీ చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే అది కుదరలేదని ఉమాభారతి వివరించారు.

English summary
Uma Bharti says she is disappointed as she was unable to solve the Cauery problem. If the need be I will sit on a hunger strike to solve the problem she says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X