పెరంబూర్ లో విజయ్ కు బిగ్ బాస్ బ్యూటీ షాాక్ ? ప్రచారానికి దిగకముందే..!

తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న టీవీకే అధినేత, హీరో విజయ్ (Vijay) రెండు చోట్ల పోటీ చేయాలని కూడా నిర్ణయంచారు. ఇందులో పెరంబూర్ నియోజకవర్గం కూడా ఒకటి. అయితే ఇక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న విజయ్ కు బిగ్ బాస్ బ్యూటీ షాకిచ్చింది. విజయ్ కంటే ముందే ఇక్కడ ప్రచారంలోకి దిగిన సదరు బ్యూటీ పంచ్ డైలాగ్ లు మొదలుపెట్టేసింది.

పెరంబూర్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందే బిగ్ బాస్ జూలీ ("Bigg Boss" Julie) ఆయనకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిపోయింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 సీట్లలో ఒంటరిగా బరిలోగి దిగుతున్న విజయ్.. పెరంబూర్ లో ఎట్టి పరిస్ధితుల్లో గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని మలుపు ఎదురైంది. బిగ్ బాస్ జూలీ విజయ్‌కు వ్యతిరేకంగా నేరుగా ప్రచారం మొదలుపెట్టారు.

Tamil Nadu Elections Bigg Boss Julie Delivers Shocker to Vijay s Perambur Campaign

పెరంబూరు నియోజకవర్గంలో విజయ్ ప్రచారానికి రాకముందే, "నేను ఇప్పటికే ప్రారంభించాను" అంటూ ఓ వీడియో విడుదల చేశారు. "నువ్వు రేపు వస్తున్నావు, నేను ఇవాళే మొదలుపెట్టేశా అన్నయ్య... రా చూసుకుందాం" అనే ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా జూలీ.. విజయ్, ఆయన పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ విమర్శలు వీడియోల రూపంలో వెలుగులోకి రాగా, ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలో వ్యతిరేక స్వరం వినిపించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

Tamil Nadu Elections Bigg Boss Julie Delivers Shocker to Vijay s Perambur Campaign

ఈ వీడియో తర్వాత విజయ్ ఫ్యాన్స్ భారీగా జూలీపై విమర్శలకు దిగుతున్నారు. జూలీ అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారా?", "ప్రచారం కోసం దీన్ని వాడుకుంటున్నారా?" వంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. కొందరు జూలీని నేరుగా విమర్శిస్తూ వ్యాఖ్యలు పోస్ట్ చేస్తుండగా, మరికొందరు ఇది ప్రజాస్వామ్యంలో సహజమైన విషయమని వాదిస్తున్నారు. మరోవైపు విజయ్ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మొదటి ఎన్నికలోనే ఇలాంటి ప్రత్యక్ష వ్యతిరేకతను ఎదుర్కొనడం, ఈ ఎన్నికలు ఎంత కఠినంగా ఉంటాయో సూచిస్తుంది. అదే సమయంలో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+