దీపాతో పన్నీర్ చర్చలు: ఎమ్మెల్యేలు బయటకు వస్తే సీన్ రివర్స్ !
జయలలిత మేనకోడులు దీపా జయకుమార్ ఇంటికి పన్నీర్ సెల్వం వర్గీయులు చర్చలు జరుపుతున్నారు. మొదట రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వస్తే వారితో దీపా మాట్లాడితో తరువాత పరిస్థితులు మారిపోతాయని,
చెన్నై: తమిళనాడు రాజకీయాలు గరంగరంగా మారడంతో పన్నీర్ సెల్వం వర్గీయులు ఆందోళనకు గురైనారు. గురువారం మద్యాహ్నం జయలలిత మేనకోడులు దీపా జయకుమార్ ఇంటికి పన్నీర్ సెల్వం వర్గీయులు పరుగుతీశారు.
దీపా జయకుమార్ తో సహ దీపా పేరవై సంస్థ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలతో చర్చలు మొదలు పెట్టారు. అయితే దీపాతో చర్చలు జరుపుతున్న నాయకులు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శశికళ వర్గానికి చెందిన ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి కావడానికి అనుమతి ఇవ్వడంతో పన్నీర్ సెల్వం వర్గీయులు మరో కోణంలో ఆలోచిస్తున్నారు. మొదట రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వస్తే తరువాత పరిస్థితులు మారిపోతాయని అనుకుంటున్నారు.
అయితే అది అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో దీపా మాట్లాడితో పరిస్థితులు తలకిందలు అయ్యే అవకాశం ఉందని, ఆరోజు త్వరలోనే వస్తుందని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు. అదే జరిగితే శశికళ వర్గానికి పెద్ద దెబ్బ అని రాజకీయ ప్రముఖులు అంటున్నారు.












Click it and Unblock the Notifications