చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రపతితో గవర్నర్ విద్యాసార్ రావ్ భేటీ: 18 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల విషయం !

తమిళనాడు రసవత్తర రాజకీయాలుఢిల్లీలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ బిజీరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ, 18 మంది ఎమ్మెల్యేల విషయంలో ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ న్యూఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి తమిళనాడు రాజకీయాలపై చర్చించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు.

షాక్: రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు: గవర్నర్ రాక ముందే దినకరన్ దిమ్మ తిరిగింది!షాక్: రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు: గవర్నర్ రాక ముందే దినకరన్ దిమ్మ తిరిగింది!

తమిళనాడు రాజకీయాల విషయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ముఖ్యంగా చర్చించనున్నారని సమాచారం. రాష్ట్రపతి సూచనలు సలహాలు తీసుకున్న తరువాత తమిళనాడు ప్రభుత్వం విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ నిర్ణయించారని తెలిసింది.

Tamil Nadu Governor going to meet President of India on today

తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు లేదని, శాసన సభలో సీఎం బలపరీక్ష నిర్వహించి మెజరిటీ నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

హైకోర్టును ఆశ్రయించిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు: దొడ్డిదారిలో సీఎం బలపరీక్ష హైకోర్టును ఆశ్రయించిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు: దొడ్డిదారిలో సీఎం బలపరీక్ష

ఇదే సమయంలో టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 18 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఢిల్లీలోనే తమిళనాడు విషయంలో ఓ నిర్ణయం తీసుకున్న తరువాత చెన్నై వెళ్లాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ నిర్ణయించారని తెలిసింది.

English summary
Tamil Nadu Governor going to meet President of India on today evening. Tamil Nadu AIADMK MLAs issue may be the agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X