• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గవర్నర్ నా చెంపను తాకారు, మహిళా జర్నలిస్టు మండిపాటు

By Narsimha
|
  తమిళనాడు గవర్నర్ పై లేడీ జర్నలిస్ట్ మండిపాటు

  చెన్నై:తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌ పురోహిత్‌ రాజ్‌భవన్‌లో మహిళా జర్నలిస్టు చెంపను తాకి ఇరుకున పడ్డారు. ఈ విషయమై ఆ జర్నలిస్టు ట్విట్టర్ వేదికగా స్పందించారు. గవర్నర్ చర్యను ఆమె తప్పుబట్టారు.

  విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిందనే ఆరోపణలపై మధురై కామరాజ్‌ అనుబంధ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర‍్మలాదేవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగుచూడడంతో ఆ రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.అయితే తనకు గవర్నర్ పురోహిత్ తెలుసునని ఆమె ప్రకటించడం సంచలనం కల్గించింది.

  ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వ్యవహరించే తీరు కొన్ని సమయాల్లో వివాదంగా మారుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రోఫెసర్ తనకు గవర్నర్ పరిచయం ఉందని ప్రకటించింది.ఆ ప్రోఫెసర్ విద్యార్ధులను లైంగిక చర్యకు సిద్దం కావాలని ప్రోత్సహించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఈ విషయమై మంగళవారం నాడు రాజ్‌భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

  ఆ మహిళా ప్రోఫెసర్ ఎవరో కూద తనకు తెలియదన్నారు. విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ వేదికపై నుండి దిగి వెళ్ళిపోతున్న సమయంలో ఓ మహిళా జర్నలిస్టు ఇదే విషయమై మరోసారి గవర్నర్‌ను ప్రశ్నించింది.

  Tamil Nadu Governor Pats Woman Journalist On Cheek Without Consent, Triggers Outrage

  అయితే గవర్నర్ సమాధానం చెప్పకుండా తన చెంపను తాకినట్టుగా ఆమె చెప్పారు.ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్దతి కాదన్నారు. తన ముఖాన్ని పదే పదే శుభ్రం చేసుకొన్నానని ఆమె చెప్పారు. మీరు నాకు తాతయ్య లాంటి వారే కావొచ్చు, కానీ మీ చర్య నాకు తప్పుగా అనిపిస్తోందని ఆ జర్నలిస్టు ఆ ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  lok-sabha-home

  English summary
  Tamil Nadu Governor Banwarilal Purohit held a press conference on Tuesday evening to clear his name from a controversy surrounding a professor arrested in the 'sex for degrees' case. However, the Governor walked into another row when he patted the cheek of a woman journalist, without her consent, seemingly to dodge her question.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more