తమిళనాడులో లాక్ డౌన్..? ఆదివారం మాత్రమే.. 9నుంచి స్టార్ట్

ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వేరియంట్.. ఒమిక్రాన్ కేసులు కూడా రావడంతో హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ కూడా విధించాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆదివారం (9వ తేదీ) పూర్తి లాక్ డౌన్ విధించింది. ఇక నుంచి ప్రతీ ఆదివారం లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టంచేసింది.

Recommended Video

    Third Wave : Next Two Weeks Will Be The Game Changer | Oneindia Telugu

    అంతేకాదు ఈ నెల 6వ తేదీ నుంచి కర్ఫ్యూ కొనసాగనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. వాణిజ్య సముదాయాలు, షాపులు, హోటళ్లు మూసివేస్తారు. ఆదివారాలు మాత్రం పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నారు. ఆదివారం లాక్ డౌన్ ఉన్న.. 24 గంటల పాటు పెట్రోల్ బంకు ఓపెన్ ఉంటాయని వివరించాయి. కేసులను బట్టి కర్ఫ్యూ సమయం పొడగించే అవకాశం ఉంటుంది.

    Tamil Nadu imposes full lockdown on Sundays as Covid cases spike

    గత ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వచ్చాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

    ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా చేరే అవకాశం ఉంటుంది. ఈ నెల ఆఖరు వరకు కర్ఫ్యూ.. లేదంటే స్వల్పంగా లాక్ డౌన్ విధించే సిచుయేషన్ అయితే ఉంది. కేసుల తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. రోజు రోజుకు అయితే కేసులు మాత్రం పెరగడం కాస్తం ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+