వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టు బ్యాన్: సుప్రీం కోర్టు తీర్పు వారం వాయిదా ! ఎందుకంటే ?

జల్లికట్టు నిషేధంపై సుప్రీం కోర్టు వెల్లడించాల్సిన తీర్పు వారం రోజులు వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే తమిళనాడు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జల్లికట్టు నిషేధంపై సుప్రీం కోర్టు వెల్లడించాల్సిన తీర్పు వారం రోజులు వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే తమిళనాడు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఒకటి రెండురోజుల్లో జల్లికట్టు: పన్నీర్, మీ పని మీరు చూసుకోండి

కేంద్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జల్లికట్టు అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తరువాత తీర్పు వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో మనవి చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు వారం రోజులు వాయిదా వేసింది.

Tamil Nadu Jallikattu ban: Supreme Court delays verdict by a Week, as asked Center

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలు, ఉద్యమాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. జల్లికట్టు నిర్వహణకు అనూహ్యంగా మద్దతు పెరిగిపోవడంతో మెరీనా బీచ్ జనసంద్రం అయ్యింది.

బెంగళూరులో దుమ్ములేపిన తమిళ తంబీలు: జల్లికట్టు ఎఫెక్ట్

శుక్రవారం చెన్నైలోని మెరీనా బీచ్ లో లక్ష మందికి పైగా ధర్నాలో పాల్గోని జల్లికట్టు నిర్వహించాలని నినాదాలు చేశారు. జల్లికట్టు నిర్వహించడానికి ఆర్డినెన్స్ తేవాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఆర్డినెన్స్ ముసాయిదాను కేంద్ర హోం శాఖకు పంపించామని, వీలైనంత త్వరగా ఆర్డినెన్స్ వస్తుందని సీఎం పన్నీర్ సెల్వం పదేపదే ఆందోళనకారులకు మనవి చేసినా వారు మాత్రం ఆయన మాటలు పట్టించుకోవడం లేదు.

English summary
The Supreme Court has agreed to the central government's request to not give its verdict on the Jallikattu ban at least for a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X