జల్లికట్టు ఆందోళన హింసాత్మకం: పన్నీర్ సెల్వం సంచలన నిర్ణయం

చెన్నై: జల్లికట్టు ఆందోళన సందర్బంగా చెన్నైలో జరిగిన అల్లర్లకు అసలు కారణం ఎవరు ? అని వెలుగు చూడటానికి మద్రాస్ హైకోర్టు రిటైడ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తామని మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు.

జల్లికట్టు ఆందోళన సందర్బంగా చెన్నై మెరీనా బీచ్ రణరంగం అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ పోలీసు స్వయంగా వాహనాలకు నిప్పంటిస్తున్న వీడియో బయటకురావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

Tamil Nadu Jallikattu violence: Retired judge to head probe team

జల్లికట్టు సందర్బంగా జరిగిన ఆందోళనలో హింస చోటు చేసుకోవడానికి ఎవరు కారణం ? అని నిగ్గు తేల్చడానికి హైకోర్టు రిటైడ్ జడ్జితో విచారణ చేయిస్తామని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. ఆందోళన అల్లర్లుగా మారడానికి పోలీసులు కారణం అయ్యారా ? అని ఆరా తీయ్యాలని సూచించామని సీఎం చెప్పారు.

జల్లికట్టు ఆందోళనలో భాగంగా చెన్నై నగరంలో 21 మందితో సహ తమిళనాడులో 36 మంది విద్యార్థులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. విద్యార్థుల మీద నమోదు చేసిన కేసులు ఎత్తివేయడానికి న్యాయనిపుణులతో చర్చించి ఆ దిశగా చర్యలు తీసుకుంటామని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+