Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెడ్ రూంలో ప్రియుడితో కామంతో రగిలిపోయిన తల్లి, ఆకలితో బిడ్డ ఏడ్చిందని బ్రాంది తాగించి, ఎవడు !

చెన్నై/ హోసూరు: బెడ్ రూంలో మద్యం మత్తులో ప్రియుయులతో ఎంజాయ్ చేస్తున్న తల్లికి ఆకలితో ఉన్న బిడ్డ ఏడుపులు, అరుపులు రుచించలేదు, కన్నబిడ్డ మీద విరుచుకుపడిన తల్లి చివరికి చిన్నారికి బ్రాంది తాగించి చంపేయ్యడానికి ప్రయత్నించింది. బిడ్డ ఆర్తనాదాలు చెయ్యడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి చూడగా తల్లి పైచాచికం బయటపడింది. కామంతో రగిలిపోతున్న తల్లికి దేహశుద్ది చేసిన స్థానికులు ఆమెను పోలీసులకు అప్పగించారు.

తట్టుకోలేక వదిలేసిన భర్త

తట్టుకోలేక వదిలేసిన భర్త

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరు (కర్ణాటక సరిహద్దు) సమీపంలో బాగలూరులో నివాసం ఉంటున్న నందినికి ఆరు సంవత్సరాల క్రితం మాదేష్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. మాదేష్, నందిని దంపతులకు నయనశ్రీ (3) అనే కుమార్తె ఉంది. నందిని ప్రవర్తనతో, ఆమె ఆగడాలతో విసిగిపోయిన భర్త మాదేష్ ఆమెను వదిలేశాడు.

మద్యం తాగుతూ ఎంజాయ్

మద్యం తాగుతూ ఎంజాయ్

భర్త మాదేష్ వదిలేయడంతో నందిని కుమార్తె నయనశ్రీతో కలిసి బాగలూరులో వేరుగా కాపురం ఉంటోంది. భర్త దూరం కావడం, అడిగేవారు లేకపోవడంతో నందిని ఆడిందే ఆటగా.... పాడిందే పాటగా తయారైయ్యింది. నందిని మద్యం తాగుతూ విలాసవంతమైన జీవితం గడుపుతోంది. కుమార్తె నయనశ్రీని సైతం నందిని పట్టించుకునేది కాదు.

ప్రియుడితో రాసలీలలు

ప్రియుడితో రాసలీలలు

భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న నందినికి అశోకన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. నందిని, అశోకన్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. అశోకన్ తో కలిసి నందిని ఎంజాయ్ చేస్తోంది. రోజు నందిని ఇంటికి వెలుతున్న అశోకన్ ఆమెతో రాసలీలలు సాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు నందిని, అశోకన్ బయట తిరుగుతున్నారు.

బెడ్ రూంలో ఉంటే బిడ్డ అరుపులు

బెడ్ రూంలో ఉంటే బిడ్డ అరుపులు

సోమవారం మద్యాహ్నం అశోకన్ మద్యం (బ్రాంది) తీసుకుని ప్రియురాలు నందిని ఇంటికి వెళ్లాడు. తరువాత ఇంటిలో మందు పార్టీ చేసుకున్నారు. అనంతరం బెడ్ రూంలో నందిని ప్రియుడు అశోకన్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఆ సమయంలో నందిని కుమార్తె నయనశ్రీ ఆకలితో కేకలు వేసింది. బెడ్ రూంలో ప్రియుడు అశోకన్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న నందినికి కుమార్తె అరుపులు రుచించలేదు.

బిడ్డకు బ్రాంది తాగించిన తల్లి

బిడ్డకు బ్రాంది తాగించిన తల్లి

బెడ్ రూంలో నుంచి బయటకు వచ్చిన నందిని కుమార్తె నయనశ్రీ మీద విరుచుకుపడింది. మద్యం మత్తులో బిడ్డను చితకబాదింది. దెబ్బలు తట్టుకోలేని నయనశ్రీ మరింతగా కేకలు వేసింది. మద్యం మత్తులో ఉన్న నందిని పక్కన ఉన్న బ్రాంది బాటిల్ తీసుకుని కుమార్తె నయనశ్రీకి తాగించి కేకలు వెయ్యకుండా చెయ్యాలని ప్రయత్నించింది,

చితకబాదిన స్థానికులు

చితకబాదిన స్థానికులు

తల్లి మద్యం తాగించడంతో తట్టుకోలేని చిన్నారి నయనశ్రీ ఆర్తనాదాలు చెయ్యడంతో చుట్టుపక్కల వారు వచ్చి విషయం గుర్తించి తల్లి నందినిని పట్టుకుని చితకబాదేశారు. వెంటనే అంబులెన్స్ లో చిన్నారిని బాగలూరు ఆరోగ్య కేంద్రానికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బగలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేయించిన తరువాత నయనశ్రీని హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మద్యలో మూడో ప్రియుడు ఎవడు ?

మద్యలో మూడో ప్రియుడు ఎవడు ?

పోలీసులు నందిని, ఆమె ప్రియుడు అశోకన్ ను అదుపులోకి తీసుకున్నారు. తనకు మద్యం సేవించే అలవాటు లేదని, బ్రాంది కావాలని అడిగితే తీసుకెళ్లి ఇచ్చానని, నందినినే చిన్నారికి మద్యం తాగించిందని అశోకన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాను ఇంటికి వెళ్లకముందే వేరే వ్యక్తి నందినితో బెడ్ రూంలో ఉన్నాడని, అతనితో కలిసి చిన్నారికి మద్యం తాగించి ఉంటారని అశోకన్ పోలీసులకు చెప్పాడు. అశోకన్ కంటే అంతకు ముందు నందిని ఎవరితో కలిసి బెడ్ రూంలో ఉంది ? అతను చిన్నారికి మద్యం తాగించాడా ? అసలు వాడు ఎవడు ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. బాగలూరు పోలీసులు, హోసూరు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+