సిట్టింగ్ ఎంపీ ప్రాణం తీసిన టిక్కెట్, మరోసారి ఎంపీ కావాలనే ఆశతో, నిద్రమాత్రలతో బెదిరించి ?
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిన తమిళనాడు ఎండీఎంకే సీనియర్ నేత, ఈరోడ్ ఎంపీ గణేష్ మూర్తి కన్నుమూశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న ఎంపీ గణేష్ మూర్తి గురువారం వేకువ జామున తుది శ్వాస విడిచారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
గణేష్ మూర్తి ఎండీఎంకే పార్టీ సీనియర్ నాయకులలో ఒకరు. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఈరోడ్ నుండి డీఎంకే కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని గణేష్ మూర్తి అనుకున్నారు. గణేష్ మూర్తి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం తనకే వస్తుందని, తనకు సీటు ఇవ్వాలని ఇంతకాలం ఆశపడ్డారు.

అయితే ఈసారి ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎండీఎంకే స్వతంత్రంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. టికెట్ రాలేదన్న కారణంతో మార్చి 24వ తేదీన గణేష్ మూర్తి నిద్రమాత్రలు సేవించి ఆత్మహత్యకు యత్నించాడని సమాచారం. విషయం గుర్తించిన మూర్తిని కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స కొనసాగించారు.
#UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2
— ANI (@ANI) March 28, 2024
అయితే దురదృష్టవశాత్తు గురువారం వేకువ జామున సుమారు 5 గంటల సమయంలో ఈరోడ్ ఎంపీ గణేష్ మూర్తి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం. నిద్రమాత్రలు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ గణేష్ మూర్తికి చికిత్స అందిస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన చికిత్స విఫలమై చనిపోయారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో మరోసారి పోటీ చెయ్యాలని ఆశతో పార్టీ నాయకులను బెదిరించాలని నిద్రమాతలు మింగిన గణేష్ మూర్తి చికిత్స విఫలమై చనిపోవడంతో ఎండీఎంకే పార్టీలో విషాదచాయలు నెలకొన్నాయి.
సిట్టింగ్ ఎంపీ గణేష్ మూర్తి లోక్ సభ ఎన్నికల టిక్కెట్ కోసం ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడులోని రాజకీయ నాయకులు హడలిపోయారు. తమిళనాడులోని రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా గణేష్ మూర్తి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications