Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..?

తమిళనాడులో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలపై (tamil nadu assembly election 2026) స్థానిక అగ్ని న్యూస్ సర్వీస్ (ఏఎన్ఎస్) నిర్వహించిన తాజా సర్వేలో షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే మ్యాట్రిజ్-అయాన్స్ సర్వేలో అన్నాడీఎంకే-బీజేపీ (bjp) కూటమి ముందంజలో ఉందని తేలిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన అగ్ని న్యూస్ సర్వీస్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సర్వేలో ఈసారి రాష్ట్రంలో అధికారం ఎవరిదో క్లియర్ కట్ గా తేలిపోయింది. అంతే కాదు జాతీయ పార్టీ బీజేపీకి మాత్రం గట్టి షాక్ తగిలింది.

తమిళనాడులో ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై 'అగ్ని న్యూస్ సర్వీస్' ఫిబ్రవరి 7 నుంచి మార్చి 12 వరకు నిర్వహించిన పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న నాలుగు స్థానాల్లో ఈసారి కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధిస్తుందని, మిగిలినచోట్ల డీఎంకే (dmk) కైవసం చేసుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది.

Tamil Nadu New Survey Predicts bjp Will Win Only 1 of 4 Seats but here is clear winner

ప్రస్తుత ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి, విజయ్ 'తమిళగ వెట్రి కళగం', సీమాన్ 'నామ్ తమిళర్ కట్చి', అలాగే శశికళ-రామదాస్ కూటమి మధ్య ఐదు పార్టీల పోటీ నెలకొంది. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 44.9 శాతం ఓట్లతో ముందుండగా, అన్నాడీఎంకేకు 38.5 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. విజయ్ 'తమిళగ వెట్రి కళగం' 9.7 శాతం, నామ్ తమిళర్ కట్చి 4.8 శాతం, నోటా 2.1 శాతం ఓట్లు పొందనున్నాయి. సీట్ల విషయానికి వస్తే, డీఎంకే కూటమి 180కి పైగా స్థానాల్లో, అన్నాడీఎంకే 54 స్థానాల్లో గెలుస్తుందని సర్వే అంచనా వేసింది.

Tamil Nadu New Survey Predicts bjp Will Win Only 1 of 4 Seats but here is clear winner

2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 20 స్థానాలు కేటాయించగా, నెల్లైలో నైనార్ నాగేంద్రన్, కోయంబత్తూర్ సౌత్‌లో వానతి శ్రీనివాసన్, నాగర్‌కోయిల్‌లో ఎం.ఆర్.గాంధీ, మొడకురిచ్చిలో సి.సరస్వతి విజయం సాధించారు. అయితే తాజా సర్వే ప్రకారం, బీజేపీ గతంలో గెలిచిన ఈ నాలుగు స్థానాల్లో ఒక చోట మాత్రమే విజయం సాధించగలదని, మిగిలిన మూడు చోట్ల డీఎంకే గెలుస్తుందని అంచనా. ఇదే సర్వే గత లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అన్నామలై లక్ష ఓట్ల తేడాతో ఓడిపోతారని అప్పట్లో అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+