కాలేజ్ అమ్మాయిలో రాసలీలలు, మరొ లేడీ ప్రొఫెసర్ విచారణ, ఒకే గదిలో, ఎస్కేప్ !
Recommended Video

చెన్నై: తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లా అరుప్పుకోటై దేవాంగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి వ్యవహారంలో ఇతర జిల్లాలకు చెందిన కాలేజీల లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులను సీబీసీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. నిర్మలా దేవి సెక్స్ స్కాం కేసులో ఎంత మందికి సంబంధం ఉంది అని క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. నిర్మలా దేవి విచారణలో చెప్పిన వారికి సీబీసీఐడీ అధికారులు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

తుత్తుకూడి మేడమ్
తూత్తుకూడికి చెందిన మహిళా కళాశాల బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జెసింత తమిళమలర్ కు సీబీసీఐడి అధికారులు సమన్లు జారీ చేశారు. సమన్లు అందుకున్నఅసిస్టెంట్ ప్రొఫెసర్ జెసింత తమిళమలర్ అధికారుల ముందు విచారణకు హాజరైనారు.

ఒకే గదిలో ఉన్నాం
విద్యార్థినులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో తప్పనిసరి పరిస్థితిలో నిర్మలా దేవితో కలిసి మదురైలో ఒకే గదిలో ఉన్నానని, అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదని, విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరిస్తానని జెసింత తమిళమలర్ సీబీసీఐడీ అధికారులకు చెప్పారని తెలిసింది.

కోర్టులో లొంగిపోయాడు
నిర్మలా దేవి సెక్స్ స్కాం కేసులో తప్పించుకుని తిరుగుతున్న మదురై కామరాజర్ యూనివర్శిటీ స్కాలర్ విద్యార్థి కరుప్పుస్వామి కోసం సీబీసీఐడీ అధికారులు గాలించారు. ఇదే సమయంలో కరుప్పుస్వామి తన న్యాయవాదులను వెంట పెట్టుకుని మదురైని క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తి సబీన ముందు లొంగిపోయాడు.

కస్టడీకి కామంధులు
మదురై కామరాజర్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ ను అరెస్టు చేసిన సీబీసీఐడీ అధికారులు అతన్ని కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో ఐదు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. స్కాలర్ విద్యార్థి కరుప్పుస్వామిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మరో ఇద్దరు యువతులు
అరుప్పుకోటైలోని దేవాంగర్ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్న మరో ఇద్దరు అమ్మాయిలు మేడమ్ నిర్మలా దేవి తమను అధికారులకు పడక సుఖం ఇవ్వాలని ఒత్తిడి చేశారని న్యాయవాది ముత్తుకుమార్ సహాయంతో మాజీ ఐఏఎస్ అధికారి సంతానం విచారణ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

పెద్దలు ఎస్కేప్
నిర్మలా దేవి వ్యవహారంలో కిందస్థాయి అధికారులు, విద్యార్థులను అరెస్టు చేసి పెద్దలను తప్పించే అవకాశం ఉందని కరుప్పుస్వామి న్యాయవాదులు కోర్టులో చెప్పారు. కరుప్పుస్వామి లొంగిపోయాడని, అతను అప్రూవర్ గా మారుతానని చెబుతున్నాడని అతని న్యాయవాదులు కోర్టులో మనవి చేశారు.

మంత్రులు ఎవరు
నిర్మలా దేవి మొబైల్ లో తమిళనాడు మంత్రులు, ఐఏఎస్ అధికారులు జాతకాలు ఉన్నాయని తమిళ మీడియా వార్తలు ప్రచురించింది. అయితే నిర్మలా దేవితో సంబంధం పెట్టుకున్న ఆ మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఎవరు ? అనే విషయం ఇంత వరకూ బయటకురాలేదు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications