కోట పక్కన పబ్లిక్ పార్క్ లో లవర్స్, ప్రియుడిని చితకబాది, ప్రియురాలి మెడపై కత్తి, గ్యాంగ్ రేప్
చెన్నై/ వేలూరు: ప్రియుడితో కలిసి కోట పక్కనే ఉన్న పబ్లిక్ పార్క్ లో ఉన్న సమయంలో కామాంధులు వారిని అల్లరి చేశారు. ప్రియుడు, ప్రియురాలు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో కామాంధులు వారిని అడ్డుకున్నారు. ప్రియుడిని చితకబాదిన తరువాత ప్రియురాలి గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి గ్యాంగ్ రేప్ చేశారు. యువతి మీద అత్యాచారం చేసిన నిందితులు ఆమె శరీరం మీద ఉన్న బంగారు నగలు లూటీ చేశారు. పోలీసులు కామాంధుల బెడ్ తీసి విచారణ చేస్తున్నారు.

పర్యాటక కేంద్రం
ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులో వేలూరు ఉంది. వేలూరు కోట ప్రముఖ పర్యాటక కేంద్రం. వేలూరు కోట సమీపంలోనే చాలా విశాలమైన పబ్లిక్ పార్క్ ఉంది. ప్రతినిత్యం వేలూరు కోటను, అక్కడి పార్క్ ను చూడటానికి అనేక మంది పర్యాటకులు వెలుతుంటారు. అంతే కాకుండా వేలూరులో ఎంతో పేరు ఉన్న సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లే రోగుల బంధువులు సైతం ఈ కోటను, పార్క్ ను చూడటానికి వెలుతుంటారు.

కోట పక్కన పబ్లిక్ పార్క్ లో ప్రేమికులు
24 ఏళ్ల యువతి, ఆమె ప్రియుడు వేలూరు కోట సమీపంలోని పబ్లిక్ పార్క్ లోకి రాత్రి వెళ్లారు. ఇద్దరూ ఉల్లాసంగా, ఏకాతంగా పార్క్ లో ఉన్న సమయంలో ముగ్గురు యువకులు అటువైపు వెళ్లారు. ఏకాంతంగా ఉన్న యువతి, యువకుడి మీదకు నిందితులు రాళ్లు, అక్కడి పూల చెట్ల కొమ్మలు విసిరి అల్లరి చేశారు.

వదిలేయాలని వేడుకున్న ప్రేమికులు
యువకులు ఎక్కువ అల్లరి చెయ్యడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని యువతి, యువకుడు నిర్ణయించారు. అయితే యువతి, యువకుడిని అడ్డుకున్న నిందితులు రెచ్చిపోయారు. ఆ సమయంలో మమ్మల్ని వదిలివేయాలని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించామని, ఇక్కడ ఏకాంతంగా మాట్లాడుకోవడానికి వచ్చామని యువతి, యువకుడు వేడుకున్నారు.

చితకబాది, కత్తితో బెదిరించి !
యువకుతి, యువకుడు భయపడ్డారని తెలుసుకున్న కామాంధులు ప్రియుడిని పట్టుకుని చితకబాదేశారు. తరువాత జోబులో ఉన్న కత్తులు తీసుకుని యువతి గొంతు మీద పెట్టి చంపేస్తామని బెదిరించారు. యువకుడిని కట్టేసి అతని కళ్ల ముందే యువతిని నగ్నంగా తయారు చేసి ముగ్గురు కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు.

చంపేస్తాం, మర్యాదగా వెళ్లిపోండి !
యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు విషయం బయటకు చెబితే చంపేస్తామని ఇద్దరిని బెదిరించారు. తరువాత యువతి శరీరం మీద ఉన్న బంగారు నగలు లూటీ చేశారు. యువతి, యువకుడి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు లాక్కొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు.

ధైర్యం చేసిన యువతి
కామాంధులు చేసిన అరాచకంతో పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి మొదట యువతి భయపడింది. తరువాత ఏమైతే అది కాని అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా వేలూరు పరిసర ప్రాంతాల్లో కామాంధుల కోసం గాలించారు.

బెండ్ తీసిన పోలీసులు
యువతి మీద గ్యాంగ్ రేప్ చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు మణికందన్, శక్తినాథన్, అజిత్ అనే ముగ్గురు కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని మాత్రం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. మరో నిందితుడిని విచారణ చేస్తున్నందున అరెస్టు చూపించలేదని తెలిసింది. యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన నిందితులు వేలూరు వాసులే అని, వేలూరు కోట పరిసర ప్రాంతాల్లో నిందితులు గతంలో పర్యాటకులను లూటీలు చేశారని ఇప్పటికే కేసులు నమోదైనాయని పోలీసు అధికారులు తెలిపారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications