Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..!
తమిళనాడు (Tamil nadu)లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమికీ, విపక్ష అన్నాడీఎంకే, విజయ్ కొత్త పార్టీ టీవీకేకు మధ్య త్రిముఖ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో తాజాగా వెలువడిన మ్యాట్రిజ్-అయాన్స్ సర్వే (Matrize-IANS Opinion Poll) షాకింగ్ ఫలితాలు ఇచ్చింది. తమిళనాడులో ఇంతవరకూ పటిష్టంగా ఉందని, మరోసారి అధికారంలోకి రావడం తథ్యమని భావిస్తున్న డీఎంకే కూటమికి షాకిస్తూ.. బీజేపీ మిత్రపక్షాలు లీడ్ లో ఉన్నాయని ఈ సర్వే తేల్చింది.
234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి డీఎంకే నేతృత్వంలోని కూటమి కంటే స్వల్పంగా ముందంజలో ఉందని మ్యాట్రిజ్-ఐఏఎన్ఎస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. రెండు ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ నెలకొని ఉందని ఇందులో తేలింది. చిన్న పార్టీలు పరిమిత సీట్లే గెల్చుకునే అవకాశం ఉన్నా.. కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఈ సర్వే సూచిస్తోంది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు ఈ అభిప్రాయ సేకరణ జరిగింది.

మ్యాట్రిజ్-అయాన్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం తమిళనాడులో ఈసారి బీజేపీ మిత్రపక్షాలు 114-127 సీట్లు గెల్చుకునే అవకాశం ఉందని తేలింది. అలాగే డీఎంకే మిత్రపక్షాలు కేవలం 104-114 సీట్లకు పరిమితం అవుతాయని సర్వే తెలిపింది. విజయ్ టీవీకేకు 6-12 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. ఇతరులకు 1-6 సీట్లు లభిస్తాయని ఒపీనియన్ పోల్ లో తేల్చారు. తమిళనాడులో అధికారం చేజిక్కించుకోవాలంటే ఏ పార్టీ లేదా కూటమికి అవసరమైన మ్యాజిక్ మార్క్ 118 సీట్లను బీజేపీ కూటమి సాధిస్తుందని ఈ సర్వే తెలిపింది. మరి ఈ అంచనాలు ఎంతవరకూ నిజమవుతాయో తేలాలంటే మే 4 వరకూ ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications