చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో సూర్యోదయం: 'అమ్మ' ప్రభుత్వం విఫలం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: గత నెల రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై మహానగరం క్రమంగా కోలుకుంటోంది. 20 రోజుల తర్వాత తొలిసారిగా చెన్నై వాసులు సోమవారం సూర్యుడిని చూశారు. ఎడతెరిపి లేని వర్షం, ఆకాశం మొత్తం మేఘావృతమైన నేపథ్యంలో 20 రోజులుగా చెన్నైలో అసలు భానుడి ఆనవాళ్లే కనిపించలేదు.

ఇదిలా ఉంటే రోజుల తరబడి స్తంభించిన రవాణా ఈరోజు సాధారణ స్థితికి రానుంది. బస్సు, రైళ్లు, విమాన సర్వీసులు ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. నగరంలో వరదనీరు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఎటుచూసినా బురద, చెత్త దర్శనమిస్తున్నాయి.

 20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం


మరోవైపు వరద తర్వాత సహాయక, పునరావాస చర్యల్లో తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై అధికారుల తీరుపై అక్కడి ప్రజలను మండిపడుతున్నారు. చెన్నైలో సహాయం చేసేందుకు హైదరాబాద్ నుంచి 100 మంది సైనికులు, మర పడవలు, సహాయ సామాగ్రి తీసుకుని వచ్చారు.

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం

అయితే వారు ఎక్కడికి వెళ్లాలి? ఎవరికి సహాయపడాలి? ఇటువంటి విషయాలు చెప్పేందుకు ఎవరూ లేక, తమిళ అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు స్పందించక, దాదాపు 10 గంటల పాటు వారు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల నిర్వాకం వల్లే ఇలా జరిగిందని లెఫ్టినెంట్ కల్నల్ రాజేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం


తమకు చెన్నై నగరం గురించిన సమాచారం తెలియని కారణంగానే ఎక్కడ తమ అవసరం ఉందో గుర్తించలేక ఖాళీగా ఉన్నామని ఆయన అన్నారు. ఉదయం 6:30కి చెన్నై చేరిన వారికి మధ్యాహ్నం 3:30 తరువాత ఎక్కడికి వెళ్లాలో చెప్పారని అన్నారు.

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం


అయితే ఈ విషయమై చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఇంళంగోవన్ స్పందిస్తూ, అటువంటిదేమీ లేదని, తాము సైన్యానికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నామని వెల్లడించారు. తమిళనాడులో వరద సహాయచర్యలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం


వరద బాధితులకు కోసం 5,554 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 20 లక్షల మందికి సేవలు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు లక్ష పశువులు వైద్య సేవలు అందించినట్లు పేర్కొంది.

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం


ఇది ఇలా ఉంటే దాదాపు నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో అల్లాడుతున్న చెన్నైని ఇప్పుడు చెత్త భయం వెంటాడుతోంది. వరద నీరు తొలగుతుండగా మిగిలిన బురద, ఎక్కడికక్కడ గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు కార్పొరేషన్‌కు, ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారాయి.

 20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం


చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన నగర పాలక సంస్థ వాహనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం ఒక కారణం కాగా, కావాల్సినంత మంది సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమస్య తీవ్రంగా పరిణమించింది. ముఖ్యంగా చెన్నై కార్పోరేషన్‌‌కు చెందిన వాహనాలు సైతం వరద నీటిలో ఉండటంతో మొరాయిస్తున్నాయి.

 20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం


ఆహారం, నీరు సరిగా అందక అల్లాడుతున్న నగరవాసులకు చెత్తతో దుర్గంధ సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు వరదల కారణంగా నీట మునిగిన చెన్నై విమానాశ్రయం సోమవారం సాధారణ స్థితికి చేరుకుంది.

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం

20 రోజుల తర్వాత చెన్నైలో సూర్యోదయం


వరద తగ్గుముఖం పట్టిన తర్వాత సహాయచర్యలు వేగంగా చేపట్టడంతో విమాన సర్వీసులకు విమానాశ్రయం సిద్ధమైంది. ఆదివారమే కొన్ని దేశీయ విమాన సర్వీసులు నడపగా ఈరోజు నుంచి దేశీయ, అంతర్జాతీయ డే అండ్‌ నైట్‌ సర్వీసులు పునరుద్ధరించనున్నారు.

English summary
As flood waters receded in some parts of rain-ravaged Chennai, the impact of the devastation has slowly begun to emerge with rescue teams stumbling upon a few bodies inside buildings that were marooned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X