వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ వరదలకు ముళ్లపెరియార్ డ్యాం కారణం కాదు: తమిళనాడు సీఎం పళనిస్వామి

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వ్యాఖ్యలను, కేరళ ప్రభుత్వం చేసిన ఆరోపణలను తమిళనాడు ప్రభుత్వం ఖండించింది. ముళ్లపెరియార్ డ్యాం నీటిని హఠాత్తుగా విడుదల చేయడం వల్లే కేరళలో ఘోర ప్రమాదం సంభవించిందని కేరళ ఆరోపించింది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు.

Recommended Video

తమిళనాడు పై కేరళ రాష్ట్రం సంచలన ఆరోపణలు

కేరళలో వరదలకు ముళ్లపెరియార్ డ్యాం నీటి విడుదల ఏమాత్రం కారణం కాదని చెప్పారు. ఆగస్ట్ 14 నుంచి 19వ తేదీ మధ్య 36 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేశామని చెప్పారు. ఈ మేరకు కేరళ అభియోగాలపై సుప్రీం కోర్టులో తమిళనాడు కౌంటర్ కూడా దాఖలు చేసింది.

మీ వల్లే వరదలు: తమిళనాడుపై కేరళ సంచలనం, ముళ్లపెరియార్ ఎందుకు కారణం?మీ వల్లే వరదలు: తమిళనాడుపై కేరళ సంచలనం, ముళ్లపెరియార్ ఎందుకు కారణం?

కాగా, తమ రాష్ట్రంలో భారీ వరదలు, అపార నష్టానికి తమిళనాడు కారణమని కేరళ రాష్ట్రం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే ఆ నీరంతా వచ్చి ఇడుక్కి డ్యాంలోకి చేరిందని దీంతో పెను ప్రమాదం సంభవించిందని పేర్కొంది.

Tamil Nadu responds over Sudden water release from Mullaperiyar dam reason for Kerala floods

ఈ మేరకు కేరళ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ముళ్ల పెరియార్ డ్యాం నుంచి భారీగా నీరు రావడంతో ఇడుక్కి డ్యాం 15 గేట్లు ఎత్తివేశామని, దీంతో కేరళ అల్లకల్లోలంగా మారింది ఆరోపించింది.

తమిళనాడు ప్రజలకు నీటిని అందించే ముళ్లపెరియార్ డ్యాంను కేరళలో 150 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని నిర్వహణ తమిళనాడు రాష్ట్రానిదే. డ్యాం పాతది కావడం వల్ల కూల్చివేసి కొత్త డ్యాం కట్టాలని కేరళ చాలాకాలంగా చెబుతోంది. డ్యాంలో నీటిస్థాయిని 142 అడుగుల నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరుతోంది. తమిళనాడు నుంచి ఆశించిన స్పందన లేదు. ఈ కారణంగా డ్యాం నుంచి హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే కేరళ ఇంత నష్టపోయిందని ఆ రాష్ట్రం సుప్రీం కోర్టులో చెప్పింది.

ముళ్లపెరియార్ డ్యాం నుంచి నీటిని క్రమంగా విడతలవారిగా విడుదల చేయాలని కోరామని, కానీ తమ విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోలేదని కేరళ ప్రభుత్వం పేర్కొంది.

ముళ్ల పెరియార్ డ్యాం కారణంగా ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్‌తో పాటు రెండు రాష్ట్రాలు సభ్యులుగా సూపర్ వైజరీ కమిటీ ఉందని తెలిపారు. వరదలు వచ్చినప్పుడు లేదా ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో ప్యానెల్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

ముళ్లపెరియార్ డ్యాం నిర్వహణపై కేరళ ప్రభుత్వం కూడా ఎప్పటికి అప్పుడు సమాచారం అడుగుతోందని చెప్పింది. కాగా, కేరళలో భారీ వరదలు, వర్షాల కారణంగా తీసుకున్న చర్యలు, ఏం చేస్తున్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆగస్ట్ 18న కేరళ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.

English summary
Tamil Nadu’s failure to control release of water from the Mullaperiyar dam till the reservoir reached its full capacity is one of the reasons for theflash floods in Keralathat killed over 350 people and damaged property worth thousands of crores, the Kerala government said in the Supreme Court on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X