బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. ఐదు రోజుల్లో రెండో ప్రమాదం
తమిళనాడులోని సాత్తూర్‌లో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఐదురోజుల్లోనే ఇది రెండో పేలుడు . ఈ ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు టపాసులు తయారీ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ యజమాని కురుప్పస్వామితో సహా నలుగురు మృతి చెందారు. దీంతో చుటుపక్కల విషాద చాయలు అలముకున్నాయి.

యజమానితో సహా నలుగురు మృతి
విరుదునగర్ జిల్లా, సొత్తూర్ ప్రాంతం సమీపాన ఏళాయిరం పణ్నై మంజల్‌వోడై పట్టిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈప్రమాదం దాటికి నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ముగ్గురు త్రీవంగా గాయాలపాలైయ్యారు. భారీ పేలుడు దాటికి ఒక గది పూర్తిగా ద్వంసమైంది. ఫ్యాక్టరీ యజమాని కురుప్పస్వామితో సహా నలుగురు మృత్యువాత పడ్డారు.

రాపిడి కారణంగా ప్రమాదం
పేలుడు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని ఆస్పత్రికి తరలిచారు. ప్రమాదం సమయంలో 10 మంది కార్మికులు పనిచేస్తున్నారని ఫైర్ సిబ్బంది తెలిపారు. బాణసంచాలో రసాయనాలు కలుపుతుండగా రాపిడి అయి ఈ పేలుడు సంభవించినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన ఏళాయిరం పణ్నై పోలీసులు విచారణ చేపట్టారు.

ఐదు రోజుల్లో రెండో పేలుడు
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఐదురోజుల్లో ఇది రెండో పేలుడు. జనవరి 1న విరుద్‌నగర్ జిల్లా, శివకాశికి సమీపంలోని నికళత్తూర్‌లో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Recommended Video

శివకాశీలో తరచూ ప్రమాదాలు
శివకాశీ క్రాకర్స్ తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. బాణసంచా పేలుళ్లకు ఎంతో మంది ప్రాణాలు కోల్పాయారు. కార్మికుల ప్రాణాలు పోతున్న అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. టపాసులు తయారీ కేంద్రాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడంలేదు.












Click it and Unblock the Notifications