'మామ కౌగిలించుకున్నాడు'.. కోడలు ఏం చేసిందో తెలిస్తే షాక్..
కూతురిలా చూడాల్సిన కోడలిపై మామ కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కౌగిలించుకున్నాడు. కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. మామ వేధింపులు తాళలేక చివరికి ఆత్మహత్య చేసుకుంది ఆ ఇల్లాలు. ఒంటికి నిప్పంటించుకుంది. 70 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషాద ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో జరిగింది.
తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. 32 ఏళ్ల మహిళపై మామ కన్నేశాడు. కూతురిగా భావించాల్సింది పోయి ఆమెను కౌగిలించుకుని కోరిక తీర్చమని బలవంతం పెట్టాడు. దీంతో మామ లైంగిక వేధింపులు తాళలేక ఆ మహిళ చావే శరణ్యం అని తనువు చాలించింది. ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దాదాపు 70 శాతం గాయాలతో కొట్టుమిట్టాడుతూ చివరికి ప్రాణాలు విడిచింది. పోలీసుల సమాచారం ప్రకారం కోడలు రంజితను గత కొన్నేళ్లుగా వరకట్నం కోసం వేధించసాగారు అత్త మామలు. ఈ క్రమంలో మామ రంజతపై కన్నేశాడు. ఆమెను కౌగిలించుకుని కోరిక తీర్చమని బలవంతం చేశాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.
అయితే ఘటనాస్థలి ఓ లేఖను గుర్తించారు పోలీసులు. అందులో రంజిత మామపై సంచలన ఆరోపణలు చేసింది. మా మామగారు నన్ను కౌగిలించుకున్నారు. నేను దానిని తట్టుకోలేకపోయాను. అందుకు ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పింది. మామ లైంగింకంగా వేధించాడని అంతేకాక అదనపు కట్నం కోసం హింసించారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు తమ కుమార్తె రంజితను 13 ఏళ్లుగా అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని మృతురాలి తరఫు తల్లిదండ్రులు తెలిపారు. కట్నంతోపాటు ఒక ఫ్లాట్, మరింత బంగారం డిమాండ్ చేస్తున్నారని, ఆమె మామ లైంగికంగా వేధించాడని, ఆమె భర్త తాగొచ్చి కొట్టే వాడని, ఆమె ప్రతీదాన్ని మౌనంగా భరించిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications