తండూరీ కేసు: శర్మకు మరణ శిక్ష కాదు, జీవిత ఖైదు

ప్రస్తుతం మరణ శిక్షను జీవితఖైదుగా మారుస్తూ సుప్రీం తీర్పు వెలవరించింది. 1995, జులై 2న కాంగ్రెస్ కార్యకర్త నైనా సాహ్ని తండూరీ రెస్టారెంట్‌లో హత్యకు గురైంది. ఈ హత్య సాహ్నిపై ఈర్ష్యాపూర్వకంగానే జరిగిందని భావించిన ఉన్నత న్యాయస్థానం సుశీల్ వర్మ మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది.
ఢిల్లీ పోలీసుల ఛార్జీషీటు ప్రకారం.. కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతున్న తన భార్య నైనా సాహ్ని మరో కాంగ్రెస్ నేత మత్లూబ్ కరీంతో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని సుశీల్ శర్మ అనుమానించాడు. అయితే మత్లూబ్ కరీం.. నైనా క్లాస్‌మేట్ కావడంతో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకుంటారని భావించిన శర్మ నైనాపై ఈర్ష్యాను పెంచుకున్నట్లు తెలిసింది.
జులై 2న ఇంటికి చేరుకున్న శర్మ తన భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండగా చూశాడు. ఆ తర్వాత ఫోన్ రీడయల్ చేసిన శర్మకు ఆ నెంబరు మత్లూబ్ కరీందిగా తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన శర్మ తన భార్య నైనా సాహ్నిపై తన దగ్గర ఉన్న సైలెంట్ రివాల్వర్‌తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో నైనా అక్కడికక్కడే మృతి చెందింది.
నైనా మృతదేహాన్ని శర్మ, తన స్నేహితుడు, భాగియా రెస్టారెంట్ మేనేజర్ కేశవ్‌తో కలిసి తండూరి రెస్టారెంట్‌లో పెట్టి కాల్చివేశారు. అది ఒక ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసుల విచారణలో నిజం బయటపడింది. ఘటన అనంతరం పరారీలో ఉన్న శర్మ జులై 11, 1995లో పోలీసులకు లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications