దినకరన్ అనుచరుల దుమ్ములేపిన ఎంపీ వర్గం, నిన్నే బహిష్కరించారు, ఇక నన్ను !
తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్న ఆయన అనుచరుల భరతంపడుతామని అన్నాడీఎంకే కార్యకర్తలు హెచ్చరించారు.
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్న ఆయన అనుచరుల భరతంపడుతామని అన్నాడీఎంకే కార్యకర్తలు హెచ్చరించారు. టీటీవీ దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు తమిళనాడు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.
దినకరన్ గ్రూప్ లోని 19 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాజ్ భవన్ చేరుకుని తాము ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని అధికారికంగా లేఖ ఇవ్వడంతో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తంజాపూరులో స్థానిక లోక్ సభ సభ్యుడు వైద్యలింగం అనుచరులు టీటీవీ దినకరన్ అనుచురుల మధ్య మంగళవారం వాగ్వివాదం జరిగింది. ఆ సందర్బంలో టీటీవీ దినకరన్ వర్గీయులు రెచ్చిపోవడంతో ఎంపీ వైద్యలింగం అనుచరులు సహనం కోల్పోయి వారిని చితకబాదేశారు.
ఇరు వర్గాల మధ్య గొడవ ఎక్కువ కావడంతో తంజావూరు పోలీసులు ఆ పరిసర ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీటీవీ దినకరన్ తంజావూరు ఎంపీ వైద్యలింగంను త్వరలో పార్టీ నుంచి బహిష్కరిస్తానని తన అనుచరులతో చెప్పించారు. నిన్నే పార్టీ నుంచి బహిష్కరించారని, నన్నే మీరెలా బహిష్కరిస్తారని టీటీవీ దినకరన్ ను ఎంపీ వైద్యలింగం ప్రశ్నించారు. మొత్తం మీద టీటీవీ అనుచరుల మీద అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు నిఘా వేశారు.












Click it and Unblock the Notifications