వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైరస్‌ మిస్త్రీకి మరో దెబ్బ: టాటా గ్లోబల్ బేవరేజెస్ నుంచీ ఔట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టాటా గ్రూపు నుంచి ఛైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీకి మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలు టాటా కంపెనీల పదవుల నుంచి తొలగింపునకు గురైన మిస్త్రీ.. టాటా గ్రూపులోని అతి పెద్ద సంస్థ టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌(టీజీబీఎల్‌) నుంచి కూడా ఉద్వాసనకు గురయ్యారు.

సంస్థలోని పదిమంది డైరెక్టర్లల్లో ఏడుగురు ఛైర్మన్‌గా మిస్త్రీ కొనసాగింపును వ్యతిరేకించారు. టీజీబీఎల్‌ కంపెనీ ఛైర్మన్‌గా రతన్‌ టాటాకు ఆప్తుడు, నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హరీశ్‌ భట్‌ నియమితులయ్యారు.

Tata Global Beverages removes Mistry as chairman

అయితే సైరస్ మిస్త్రీ సంస్థ బోర్డు సభ్యుడిగా మాత్రం కొనసాగనున్నారు. ఈ విషయంపై మిస్త్రీ స్పందిస్తూ.. టీజీబీఎల్ బోర్డు నిర్ణయం చట్ట విరుద్ధమని, ఓటింగ్ ప్రక్రియలో బోర్డు సభ్యుల ప్రాతినిధ్యం సరిగా లేదని ఆరోపించారు. టాటా గ్రూపు సంస్థల హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్.. అక్టోబర్ 24న సంస్థ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తప్పించింది.

గతవారంలో టీసీఎస్ సారథ్యం నుంచి సైతం మిస్త్రీని తొలగించారు. అంతేగాక, గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్, టాటా కెమికల్స్, టాటా మెటార్స్, టాటా స్టీల్ బోర్డులు సైతం ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు వాటాదారుల ఆమోదం కోరనున్నాయి.

English summary
In a major escalation of boardroom brawl at the Tata Group, Cyrus Mistry was today voted out as chairman by the board of the Tata Global Beverages, the second listed firm of USD 103-billion Group to remove him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X