వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Tauktae: 184 మందిని రక్షించి ముంబయి చేర్చిన నేవీ.. ఇంకా 77 మంది ఆచూకీ గల్లంతు - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తౌక్తే తుపాను

తౌక్తే తుపానుతో గల్లంతైన వారి సంఖ్య 77కి చేరింది. మరోవైపు ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ తేజ్, ఐఎన్ఎస్ బెత్వా, ఐఎన్ఎప్ బియాస్ నౌకలు, పీ9ఐ హెలికాప్టర్ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

https://twitter.com/ANI/status/1394882769872834563

పీ305 బార్జ్ మీద పనిచేస్తున్న 184 మందిని ఐఎన్ఎస్ కోచి బుధవారం ఉదయం ముంబయి తీరానికి చేర్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా పీ305లో 273 మంది ఉన్నారని, అందరినీ సురక్షితంగా తీరానికి చేరుస్తామని అన్నారు.

ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఐఎన్ఎస్ కోచి కమాండర్

కెప్టెన్ సచిన్ సకీరా ఏఎన్ఐతో చెప్పారు.

https://twitter.com/ANI/status/1394894340967714816

గుజరాత్, కేంద్రపాలిత ప్రాంతం దమణ్‌లలోని కొన్ని ప్రాంతాలు తుపాను ధాటికి తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పర్యటించనున్నారు.

ఊనా, దీవ్, జాఫరాబాద్, మహువా ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే చేపడతారని అధికారులు తెలిపారు.

విద్యుత్ లేకపోవడంతో తరుణ్ తేజ్‌పాల్‌ కేసులో తీర్పు వాయిదా

తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌పై లైంగిక వేధింపుల కేసులో తీర్పు మే 21కి వాయిదా పడింది.

గత రెండు, మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో కేసుపై పనిచేయడానికి మరికొంత సమయం అవసరం అవుతుందని గోవాలోని మపుసా అదనపు సెషన్సు కోర్టు న్యాయమూర్తి బుధవారం తెలిపారు. మే 21న తుది తీర్పు వెల్లడిస్తానని వివరించారు.

https://twitter.com/ANI/status/1394882475520794628

2013లో గోవాలో తెహల్కా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తరుణ్ తనను వేధించారని ఆయనతో కలిసి పనిచేసిన మహిళా జర్నలిస్టు ఆరోపణలు చేశారు. అయితే వీటితో తనకు ఎలాంటి సంబంధమూలేదని ఆయన చెబుతూ వచ్చారు.

https://twitter.com/ANI/status/1394884383857778699

2012లో దిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం అనంతరం లైంగిక నేరాలపై పెద్ద చర్చలు నడుస్తున్న సమయంలో ఈ కేసు వెలుగులో కివచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tauktae: Navy rescues 184 people and brings them to Mumbai. Another 77 are missing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X